Deepika Padukone : ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ మూవీ రిలీజై వారం అవుతున్నా కూడా ఆదరణ బాగానే ఉంది.అయితే ఈ సినిమా గురించి బయటకు వస్తున్న రోజుకో వార్త కల్కిపై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం కల్కిలో దీపికా పదుకొనే పోషించిన సుమతీ పాత్రకు మరో స్టార్ హీరోయిన్ డబ్బింగ్ చెప్పిందని ప్రచారం నడుస్తుంది.సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా కనిపించింది. కల్కి పాత్రకి జన్మనివ్వబోయేది ఆమె. ఆమెను పట్టుకోవడానికి భైరవ పాత్రలో.. ప్రభాస్ ఆమె వెంట పడుతూ ఉంటాడు. అశ్వత్థామ పాత్రులో అమితాబ్ బచ్చన్.. ఆమె పాత్రను కాపాడుతూ ఉంటాడు.
ఈ సినిమాలో చాలా మంది ముఖ్య పాత్రలలో కనిపించి సందడి చేయగా, కొందరు వాయిస్ ఓవర్ అందించారు. బుజ్జి పాత్రకి కీర్తి సురేష్ వాయిస్ అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో శోభిత ధూళిపాల కూడా ఒక చిన్న భాగమే అని తెలుసా? శోభిత ఈ సినిమాలో కనిపించదు కానీ ఆమె గొంతు మాత్రం మనకి వినిపిస్తుంది. ఈ సినిమాలో దీపికా పడుకొనే పోషించిన సుమతి పాత్రకి డబ్బింగ్ చెప్పింది.. మరెవరో కాదు.. శోభిత ధూళిపాళ. తెనాలిలో పుట్టి పెరిగిన శోభిత.. గూడచారి , మేజర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. అయితే కల్కి చిత్రంతో దీపికా పదుకొణే తెలుగులోకి పరిచయం కాగా, ఒరిజినల్ కంటే ముందు దీపిక కల్కి సినిమాకు తెలుగులో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంది. ట్రైలర్‌లోనూ కూడా ఆమె గొంతు వినిపించింది.
అయితే దీపికా డబ్బింగ్‌పై దారుణంగా నెగెటివిటీ రావడంతో, ఆమె పాత్రకు శోభిత డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా శోభిత మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.సుమతి పాత్రకు డబ్బింగ్ చెప్పినందుకు థాంక్స్ చెబుతూ థియేటర్లలో శోభితకు క్రెడిట్స్ ఇచ్చారు. ఆ స్క్రీన్ షాట్ ని శోభిత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ స్వీటెస్ట్ అని రాసుకొచ్చింది శోభిత. దీంతో ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఆ ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక శోభిత.. నాగ చైతన్యతో డేటింగ్ చేస్తుందనే వార్తలతో ఇటీవల వార్తలలో నిలిచింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…