Prabhas : బాహుబలి సినిమాతో మంచి పాపులర్ దక్కించుకున్న ప్రభాస్ రీసెంట్‌గా కల్కితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా జూన్ 27న విడుదలై మంచి విజయం సాధించుకుంది. ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా ఓవర్సీస్‌లో రికార్డులు తిరగరాస్తున్నది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నార్త్ అమెరికాలో అగ్ర హీరోల రికార్డులను బ్రేక్ చేస్తున్నది. కమల్ హాసన్, దీపిక పదుకోన్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ఓవర్సీస్‌లో అదరగొడుతుంది.
కల్కి సినిమా ముఖ్యంగా నార్త్ అమెరికాలో అదరగొడుతుంది. సోమవారం నాటికి ఈ చిత్రం $850k రాబట్టి మొత్తం $12 మిలియన్లకు చేరుకుంది. ప్రభాస్ నటించిన ఈ చిత్రం ఈ వారాంతం నాటికి 15 మిలియన్ డాలర్లు వసూలు చేసే దిశగా సాగుతోంది. ట్రెండ్ ప్రకారం ఈ సినిమా 20 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ సినిమా ఘనవిజయం ప్రభాస్‌కు ఓవర్సీస్ మార్కెట్‌లో రారాజు హోదాను సుస్థిరం చేసింది. షారుఖ్ ఖాన్ తర్వాత ఉత్తర అమెరికాలో $12 మిలియన్ కంటే ఎక్కువ వసూలు చేసిన ఏకైక భారతీయ నటుడిగా సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. కల్కి మూవీ ఇప్పటికే 72 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువైంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సినిమా కలెక్షన్లను, అలాగే హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను, అలాగే సలార్ సినిమా వసూళ్లను బ్రేక్ చేయడం రికార్డుగా మారింది.
దర్శకుడు అట్లీ, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ మరియు దర్శకుడు శంకర్ వంటి ప్రముఖులు మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్రంలో సుమతిగా దీపికా పదుకొణె మరియు అశ్వత్థామ్‌గా అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. కమల్ హాసన్ యాస్కిన్ పాత్రలో నటించి మెప్పించాడు. కాంప్లెక్స్ అనే ప్రాంతం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉండగా, 2016 లో మూవీని విడుదల చేసే అవకాశం ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…