Samantha : నాగ చైతన్య- శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారం జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. చైతో నిశ్చితార్థం తర్వాత శోభిత హాట్‌టాపిక్ అవుతుంది. ఈ దెబ్బతో సమంత కూడా వార్తల్లో నిలుస్తుంది. వీరికి సంబంధించిన రీల్స్, చైతూ-సమంత పాత వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే సమంత కూడా ఇప్పుడు ఓ డైరెక్టర్‌తో డేటింగ్‌లో ఉందంటూ నెట్టింట పలు ప్రచారాలు సాగుతున్నాయి. సమంతని ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ కి పరిచయం చేసారు రాజ్ &డీకే.
వీరిద్దరూ దర్శక నిర్మాతలుగా పలు సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తున్నారు. వీరిలో రాజ్ నిడుమోరుతో సమంత డేటింగ్ లో ఉందని సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ 2తో పరిచయమయిన వీరు ఆ తర్వాత సిటాడెల్ సిరీస్ లో కూడా కలిసి పనిచేసారు. ఈ సమయంలో రాజ్ – సమంత మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరు ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని, లవ్ లో ఉన్నారని ఇప్పుడు బాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.గతంలో కూడా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చాలానే వైరల్ అయ్యాయి. సమంత పుట్టిన రోజుని రాజ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడు.
ఇప్పుడు సమంత – రాజ్ లవ్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా, భవిష్యత్తులో నెట్‌ఫ్లిక్స్ తో కలిసి ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ ప్రకటించారు రాజ్ . ఇందులో సమంత నటించే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే గతంలో సమంత నటించి ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ నుంచే చై-సామ్‌కు మనస్పర్థలు వచ్చాయని, వీరి విడాకులు ఇది కారణమనేది అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే వెబ్ సిరీస్ తీసిన దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ పుకార్లు బయటకు రావడం గమనార్హం. దీనిపై సమంత ఎలాంటి క్లారిటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…