Rajasekhar: టాలీవుడ్ బెస్ట్ కపుల్‌లో రాజశేఖర్- జీవితల జోడీ ఒకటిగా చెప్పవచ్చు. 1991లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు శివానీ, శివాత్మిక ఇద్దరు కూతుర్లు ఉండగా, వీరిద్దరు కూడా ప్రస్తుతం సినిమా రంగంలో రాణిస్తున్నారు. అయితే రాజశేఖర్, జీవిత ప్రేమ ప్రయాణం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాతికేళ్ల వారి ప్రయాణం గురించి వారిద్దరూ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇవి విని వారి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
రాజశేఖర్‌ను జీవిత ప్రేమిస్తుందనే విషయం తెలిసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు జీవితను పిలిచి, రాజశేఖర్ విలన్‌లా ఉన్నాడు, అతనిని నమ్మకు అని జీవితకు సలహా కూడా ఇచ్చారట. అయితే ఒకసారి రాజశేఖర్ నా వద్దకు వచ్చి మీరు నాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అనిపిస్తోంది అని నేరుగా అడిగేశాడు. అప్పుడు ఆయనలో ఆ ఫ్రాంక్‌నెస్ బాగా నచ్చింది’ అని జీవిత చెప్పుకొచ్చింది. రాజశేఖర్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని తెలిసి ఎంతో ఫీలయ్యాను. అప్పుడు ఆయనకు అంబాసిడర్ కారు ఉండేది. ఓ రోజు డ్రైవింగ్ సీట్లో రాజశేఖర్, పక్క సీట్లో ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కూర్చున్నారు.
వెనుక సీట్లోనేను కూర్చున్నాను. చాలా బాధ వేసింది. ఏడ్చేశాను అని జీవిత చెప్పుకొచ్చింది. ఇక అదే సమయంలో రాజశేఖర్ మాట్లాడుతూ మీరు పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు. మీతోనే ఉంటానని జీవిత చెప్పడంతో నేను చాలా ఎమోషనల్ అయ్యాను అని రాజశేఖర్ అన్నారు. ఆమె ప్రేమే నాకు నచ్చింది అని రాజశేఖర్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఇద్దరు ఎక్కడికి వెళ్లిన కలిసి కట్టుగా వెళతారు. వారిరివురిని చూసి ఇప్పటికీ చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. రీల్ లైఫ్‌లో కలిసి రియల్ లైఫ్‌లో ఒక్కటైన ఈ జంట ఎప్పటికీ ఇంతే ఆనందంగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…