Allu Arjun : ఒకప్పుడు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఒక్కటిగా ఉండేది. కాని ఎప్పుడైతే బన్నీకి స్టార్‌డం వచ్చిందో ఆయన మెగా హీరోగా చెప్పుకోవడం లేదు. తనకంటూ ప్రత్యేక ఆర్మీ ఉందని చెప్పుకుంటూ సపరేట్ ఫాలోయింగ్ ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ ఎపిసోడ్‌తో మెగా ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదంతా బన్నీ పుణ్యమేనని హార్డ్ కోర్ మెగా అభిమానుల మాట. అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ కాంట్రవర్సీ నుంచి అల్లు అర్జున్‌ని మెగా ఫ్యాన్స్ .. మెగా ఫ్యామిలీలోని వ్యక్తిగా చూడటం మానేశారు. ఒకానొక ఈవెంట్‌లో అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉందని వ్యాఖ్యానించాడు. ఈ మాటతో మెగా ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది. అంతే అల్లు అర్జున్‌పై ఉన్న కాస్త గౌరవం కూడా పక్కన పెట్టేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాయి. ఎన్నికల ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు పలికేందుకు బన్నీ తన భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాలలో దిగారు. శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులను కోరారు. ఈ ఘటనతో మెగా, పవన్ ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొచ్చింది. పవన్ గెలిచిన తర్వాత ఆయనకు విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు ఫ్యామిలీ కనిపించలేదు.ఇక రీసెంట్‌గా మారుతీ నగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మనసుకు ఇష్టమైన వారికి మన సపోర్ట్‌ను చూపించాలి, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ వ్యాఖ్యానించారు.
మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అల్లు అర్జున్ ఈ కామెంట్ చేశారంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. మెగా, అల్లు సోషళ్ మీడియా వార్‌ని వైసీపీ తనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందని కొందరు చెబుతున్నమాట.అల్లు అర్జున్ కు మద్దతుగా పవన్ అభిమానులను రెచ్చకొట్టడం, పవన్ అభిమానుల ముసుగులో అల్లు అర్జున్ ఫాన్స్ ని ఇబ్బంది పెట్టడం వైసీపీ చేస్తుందని, ఈ విషయంలో ఇరు వర్గాల అభిమానులు కాస్త ఆలోచిస్తే బాగుంటుందని కొందరు చెబుతున్నమాట. మరి ఈ వివాదం ఇంకెంత ముందుకు వెళుతుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…