YS Jagan : ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ చక్రం తిప్పుకుతున్నాయి. రెండు రాష్ట్రాలలో కొత్త పార్టీలు వచ్చాక చాలా మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతుండడం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆ పార్టీ ఖాళీ అయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ పరిస్థితి కూడా అదే మాదిరిగా మారింది. జగన్ కూడా పార్టీని వీడి వెళ్లే వారిని ఎవరినీ ఆపే ప్రయత్నం చేయడం లేదు. కనీసం పార్టీ నేతలను పంపించి అయినా బుజ్జగించడం వంటి చర్యలకు దిగడం లేదు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి ఇప్పుడు ఓటమి పాలయిన తర్వాత పార్టీని వీడివెళ్లడంపై వైఎస్ జగన్ సీరియస్ గా తీసుకుంటున్నారు. బెల్లం చుట్టూ ఈగలు చేరడం మామూలే. అలాగే వైసీపీ నేతలు కూడా అధికారంలో ఉన్నప్పుడు లీడర్లుగా బిల్డప్ లు ఇచ్చి ఇప్పుడు అధికారం కోల్పోగానే జెండాను వదిలి పెట్టి వెళ్లడం చూస్తే వారిలో ఎంతటి స్వార్థ పూరిత రాజకీయాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలని జగన్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అందుకే తాను నమ్మిన వారు.. తాను పదవులు ఇచ్చిన వారు వదలి వెళ్లి పోతున్నా కొందరు నేతలు వారితో మాట్లాడతామని చెప్పినా అవసరం లేదని వైఎస్ జగన్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలిసింది.
వెళ్లే వాళ్లను ఆపకండి అంటూ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అందుకే ఎవరు వెళ్లినా పెద్దగా పట్టించుకోవద్దని, వైసీపీకి నాయకత్వ సమస్య ఎక్కడా లేదని వైఎస్ జగన్ చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తెలిసింది. పార్టీ నుంచి వెళుతున్న వారు అనవసర సాకులు చెబుతున్నారని, పార్టీపై అభిమానం ఉంటే నేరుగా తనకు కంప్లయింట్ చేయాలని, అంతే తప్ప కుంటిసాకులు చెప్పడం ఏంటని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని, క్యాడర్ కూడా ఆందోళనలో ఉంది అని కొందరు చెప్పుకొస్తున్నారు. చూస్తేంటే రానున్న రోజులలో జగన్ వైసీపీపై ఉనికిని కోల్పోతారనే టాక్ వినిపిస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…