YSRCP : లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం.. ఎన్ని సీట్స్ వ‌స్తాయంటే..!

YSRCP : ఏపీ సంక్షేమ ప్ర‌భుత్వం లోక్ స‌భ ఎన్నిక‌లలో ఎన్ని సీట్లు సాధించుకుంటుంది, ఏ కూటమి పరిస్థితి ఏంటి? ఈటీజీ టైమ్స్ నౌ సర్వే చాలారోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఫేజ్ 3 ఫలితాలను వెల్లడించారు. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 లోక్ సభ స్థానాలను వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందంటూ ఈటీజీ టైమ్స్ నౌ సర్వేలో వెల్లడించారు. 25 స్థానాల్లో వైసీపీకి 24 నుంచి 25 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 0 నుంచి 1 సీటు, జనసేన ప్రభావం ఉండబోదని వారు చెప్పుకొచ్చారు.

ఓటింగ్ పర్సంటేజ్ క‌నుక చూస్తే.. వైసీపీకి 51.30 శాతం, తెలుగుదేశానికి 36.20, జనసేనకు 10.10 శాతం ఓట్లు, ఎన్డీఏకి 1.30 శాతం, ఇతరులకు 1.10 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని వారు స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే 9 నుంచి 11 లోక్ సభ స్థానాలు దక్కే అవకాశం ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న కూటముల విషయానికి వస్తే.. ఎన్డీఏ కూటమికి 296 నుంచి 326 సీట్లు, ప్రతిపక్ష I.N.D.I.A. కూటమికి 160 నుంచి 190 సీట్లు, బీజేడీకి 12 నుంచి 14 లోక్ సభ స్థానాలు, ఇతరులకు 11 నుంచి 14 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ సర్వే ఫలితాలపై వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

YSRCP will get majority seats in 2024
YSRCP

వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజల ఆదరణ ఎంత‌గా ఉందనేది ఈ స‌ర్వే తెలియ‌జేస్తుంద‌ని నాయ‌కులు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రభుత్వం పై బురద జల్లే వాళ్లకు ఈటీజీ టైమ్స్ నౌ సర్వే ఒక చెంప పెట్టు లాంటిదని వైసీపీ శ్రేణులు అంటున్నారు.అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ మరింత బలపడిందని ఈ సర్వే చెప్పుకొస్తుండ‌గా, ఇది ఎంత‌వ‌ర‌కు నిజం అవుతుంద‌నేది చూడాల్సి ఉంది. 2019లో 25 ఎంపీ స్థానాలకి గాను 22 స్థానాలు దక్కించుకోగా.. ఈసారి 25 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇక గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికల్లో దాదాపుగా ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని ఈ సర్వే ప్రకారం రుజువవుతోంది. ప్ర‌స్తుతం ఈ స‌ర్వేపై రాజ‌కీయాల‌లో చ‌ర్చ జోరుగా సాగుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago