RGV Chiranjeevi Movie Song : మెగాస్టార్ చిరంజీవి ఆ నాటి తరం దర్శకులు అందరితో కలిసి పని చేశారు. కొందరితో ఎక్కువ చిత్రాలు కూడా చేశారు. అందులో కొన్ని హిట్స్ మరి కొన్ని సూపర్ డూపర్ హిట్స్, ఇంకొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే శివ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మతో మాత్రం చిరు ఒకే ఒక్క సినిమా చేయగా, అది కూడా విడుదల కాలేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా టబు హీరోయిన్ పాత్రలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “వినాలని ఉంది” అనే సినిమాను అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాకు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు.
ఈ విధంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో చిరంజీవి టబు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన వినాలని ఉంది చిత్రం కొన్ని షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకునే ఆ తర్వాత అర్ధంతరంగా ఆగిపోయింది.అయితే ఈ సినిమా మధ్యలో ఆగిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే చిరంజీవితో సినిమా మొదలు పెట్టిన తర్వాత రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయంటూ రాంగోపాల్ వర్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్లడం వల్ల ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. అది కాకుండా రామ్ గోపాల్ వర్మ స్క్రిప్ట్ పై చిరంజీవి గారికి అనుమానం రావడం చేత స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాలని చిరంజీవి చెప్పినప్పటికీ వర్మ వినకపోవడంతో ఈ సినిమాను మధ్యలోనే ఆపినట్లు కూడా వార్తలు వినిపించాయి.
ఏది ఏమైన ఈ కాంబోలో సినిమా మిస్ కావడం మాత్రం ఫ్యాన్స్‌ని ఎంతగానో బాధించింది. అయితే ఇటీవల సినిమా నుండి సాంగ్ విడుదల చేశారు. ఇందులో టబు, చిరంజీవి ఇద్దరు చాలా స్టైలిష్‌గా డ్యాన్స్ లు చేశారు. చిరంజీవి స్టెప్స్ మాత్రం ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యేలా చేస్తుంది. ఇటీవల వర్మ.. చిరుతో పాటు మెగా ఫ్యామిలీపై తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సినిమా సమయంలోనే వర్మ.. చిరంజీవిపై కోపం పెంచుకోగా, దాని వల్లనే ఇప్పుడు తన కోపాన్ని ఇలా ప్రదర్శిస్తున్నాడని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…