Kadambari Jethwani : ముంబై న‌టిపై హ‌నీ ట్రాప్ కేసులు ఉన్నాయి.. వైసీపీ..

Kadambari Jethwani : ముంబై నటి కాదంబరీ జత్వానీ వ్యవహారం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం మ‌నం చూశాం. వైసీపీ పెద్ద‌లు, కొంతమంది ఐపీఎస్‌ అధికారులు కలిసి తనను వేధించారని, ఆటబొమ్మలా వాడుకుని.. అక్రమ కేసులు పెట్టారని జత్వానీ చేసిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో వైసీపీ తీవ్రంగా స్పందించింది. వైసీపీపై బురదజల్లేందుకు రెండు రోజులుగా టీడీపీ, పచ్చ మీడియా విశ్వ ప్రయత్నం చేస్తుందని విమర్శించింది. సూపర్‌ 6 హామీలను అమలు చేయలేక.. ప్రజలను తప్పదోవ పట్టించేందుకు.. హనీట్రాప్‌ చేసే మహిళను తెరపైకి తీసుకొచ్చి నాటకం ఆడుతోందని పేర్కొంది.

అన్ని రాష్ట్రాల్లో నిందితురాలు అయిన జత్వానీ.. ఏపీలో మాత్రం బాధితురాలు ఎలా అవుతుందని ప్రశ్నించింది. బాలీవుడ్‌ హీరోయిన్‌గా చెప్పుకునే కాదంబరీ జత్వానీ బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్‌ చేయడం.. అనంతరం బ్లాక్‌మెయిల్‌ చేయడంలో సిద్ధహస్తురాలు అని వైసీపీ ఆరోపించింది. ఫోర్జరీ సంతకాలు చేయడం, బోగస్‌ పత్రాలు సృష్టించడం కూడా ఆమెకు అలవాటే అని పేర్కొంది. ఈ విషయాలన్నీ పలు ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యాయని.. పలు రాష్ట్రాల్లో ఆమెపై హనీట్రాప్‌ కేసులు బుక్కయ్యాయని బయటపెట్టింది. పలు రాష్ట్రాల్లో ఆమెపై హానీట్రాప్‌ కేసులు ఉండగా.. ఏపీలో మాత్రం బాధితురాలిగా చిత్రీకరిస్తున్నారని మండిపడింది.

ysrcp comments on Kadambari Jethwani
Kadambari Jethwani

సూపర్-6 హామీలను అమలు చేయలేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికే టీడీపీ, ఎల్లో మీడియా కలిసి.. హనీ ట్రాప్ చేసే మహిళను తెరపైకి తెచ్చి నాటకం ఆడుతోంది. ఆ బురదను వైయస్ఆర్ సీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులకి రుద్దడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది అని వారు ఆరోపించారు. మ‌రోవైపు ఈ మొత్తం వ్యవహారంలో కుక్కల విద్యాసాగర్ ఎపిసోడ్ ఒక భాగం మాత్రమేనని… ఇందులో ఏపీకి చెందిన పలువురు ఐపీఎస్‌లు, ఒక ఐఏఎస్, మరికొందరు వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, నటి కాదంబరి జెత్వానీ శుక్రవారం ముంబై నుంచి విజయవాడ వచ్చారు. విజయవాడ పోలీసులను కలిసి తాను ఎదుర్కొన్న పరిణామాలను వివరించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago