CM Chandra Babu : గ‌ర్ల్స్ హాస్ట‌ల్‌లో ఎలాంటి ప‌రిక‌రాలు ల‌భించ‌లేదు.. సీఎం చంద్ర‌బాబు..

CM Chandra Babu : ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అనేక‌ కీలక మలుపులు తిరుగుతుంది. కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దీనిపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా స్పందించలేదని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై దాడి చేశారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సాయంతో సీక్రెట్ కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డ్ చేసినట్లు చెబుతున్నారు. వాటిని కొన్ని ప్రైవేట్ వెబ్ సైట్స్ కి అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తున్నారని.. రెండు నెలలుగా ఇలా జరుగుతుందని అంటున్నారు.

మ‌రోవైపు నిందితుల ద‌గ్గ‌ర 300 వీడియోలు ఉన్నాయంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే షవర్ లో హిడెన్ కెమెరా పెట్టాలని ప్రయత్నించారని.. షవర్ క్యాప్ లు తీసి కెమెరా పెట్టాలని చూశారని అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. వాష్ రూమ్స్ ముందు ఇలా ఉండేవి కాదని.. షవర్స్ లో కెమెరాలు పెట్టి వాటిని అమర్చే ప్రయత్నం చేసినట్టు అమ్మాయిలు చెబుతున్నారు. అయితే గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్ లో ఎలాంటి కెమెరాలు ఉన్నట్లు ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. కానీ బాత్రూం షవర్లలో కెమెరాలు పెట్టారని హాస్టల్ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు కూడా అధికారుల‌ని అప్ర‌మ‌త్తం చేయ‌గా, వారు కూడా ఎలాంటి ప‌రిక‌రాలు దొర‌క‌లేద‌ని చంద్ర‌బాబుకి తేల్చి చెప్పార‌ట‌.

CM Chandra Babu told that no cameras found in that hostel
CM Chandra Babu

మరోవైపు సీక్రెట్ కెమెరాలు అమర్చిందంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న విద్యార్థినిని కాలేజీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి తప్పించి వేరే చోట దాచి పెట్టినట్లు తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ అమ్మాయిని కాలేజీ యాజమాన్యం తమ కారులో రహస్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ అమ్మాయి వెంట ఒక లేడీ కానిస్టేబుల్ ని కూడా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. కాగా ఆ అమ్మాయిలో ఎలాంటి భయం లేదని.. పైగా రివర్స్ లో తమను బెదిరిస్తుందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులు దాడి చేయబోతే మిడిల్ ఫింగర్ చూపించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇక ఈ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ ఘాటుగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్‌ సైతం ఘటనపై ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. విద్యావ్యవస్థలపై నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తోందంటూ సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా స్పందించారు. కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లల జీవితాలను అతలాకుతలం చేసే ఘటనను సీరియస్‌గా తీసుకుని… నిందితులను పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు జగన్‌.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago