Roja : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ చెందిన చాలా మంది నాయకులు కనిపించకుండా పోయారు. ముఖ్యంగా రోజా ఈ మధ్య కాలంలో కనిపించడమే మానేసింది. ఇక ఆమె పార్టీ మారుతుందంటూ కూడా అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేశాయి. ఈ క్రమంలో రోజా తాజాగా స్పందించింది. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ఆర్‌కే రోజా సెల్వమణి దర్శించుకున్నారు. మంత్రిగా తిరుమలలో హల్‌చల్ చేసిన రోజా మాజీ మంత్రి హోదాలో తిరుమలను సందర్శించారు. ఎలాంటి హడావుడి లేకుండా ఆమె తిరుమలలో పర్యటించారు. ఇటీవల ఆమె తన వ్యక్తిగత సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ, మాజీ సీఎం జగన్‌కు సంబంధించిన ఫొటోలు, వివరాలను తొలగించారు.
దీంతో ఆమె వైసీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో తిరుమల సందర్శించిన సమయంలో మీడియా ఆమెను ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ మారుతున్నారా? అని ప్రశ్నించగా రోజా వాటిని కొట్టిపారేశారు. కాగా తిరుమలలో ఆమె రాజకీయ విమర్శలు చేయడం కలకలం రేపాయి. తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దని నిర్ణయించిన సమయంలో మళ్లీ ఆమె రాజకీయ విమర్శలు చేయడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక దర్శనం చేసుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారం ఊహాగానమే’ అని కొట్టిపారేశారు. ఇక ఏపీలో కూటమి పాలనపై రోజా తీవ్ర విమర్శలు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో మహిళలపై జరిగిన సంఘటనపై ప్రభుత్వం సిగ్గుపడాలి’ అని వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ప్రజలు ఓడించిన ఓటమి కాదు. ఎందుకంటే ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా పోవాల్సినంతగా తప్పులు పార్టీ, నాయకత్వం చేయలేదు. ఏం జరిగిందనేది ఈ రోజు కాకపోయినా.. ఏదో రోజు బయటకు వస్తుంది. ఆ రోజు ప్రజలు వాస్తవాలు తెలుసుకొంటారు అని రోజా అన్నారు. గత కొద్దికాలంగా వైఎస్ఆర్సీపీ ఓటమికి ఈవీఎంలే కారణమనే ఆరోపణలతో ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 40 శాతం ఓట్లు పడినా మేము ఎలా ఓడిపోతామని పలువురు కొత్త లాజిక్ తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో రోజా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ కోణంలో చేసినవేనా అనే చర్చ మొదలైంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…