Perni Nani : ముంబై న‌టి కేసు అంతా ఒక డ్రామా.. పేర్ని నాని..

Perni Nani : ముంబై న‌టి కేసు ఏపీలో కూడా ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. కాదంబరి జెత్వానీ వేధింపుల కేసు వ్యవహారంలో గత వైసీపీ పాలకుల చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోంది. తెర ముందు ముగ్గురు ఐపీఎస్ అధికారులుండగా, తెరవెనుక ఎంతమంది ఉన్నారన్నది తేలాల్చివుంది. శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు మొదలైన విచారణ రాత్రి 10 గంటలకు వరకు సాగింది. అంటే దాదాపు నాలుగు గంటలపాటు జరిగిందన్నమాట. ఆమె వాంగ్మూలాన్ని మొత్తం వీడియో రూపంలో అధికారులు భద్రపరిచారు. చివరకు మీడియా ముందుకు వచ్చిన కాదంబరి, ఏపీ పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది.

వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని తెలిపింది. ముఖ్యంగా ముంబై కేసుకు ఏపీలో నమోదైన కేసుకు లింక్ ఉందని తాను భావిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టింది. ఇందులో అధికారం, డబ్బు కీలక పాత్ర పోషించాయి. నిజం బయటకు వస్తుందని అప్పటి సీపీ కాంతిరానా తనపై అక్రమ కేసులు బనాయించారు. తనను 10 నుంచి 15 మంది పోలీసులు కిడ్నాప్ చేశారని, వారు తక్కువ స్థాయి అధికారులు ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది నటి. ఇందులో రాజకీయ నాయకులకు సంబంధం ఉందా లేదా అన్నది తేలాల్చి ఉందన్నారు. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆంజనేయులు, కాంతిరానా, విశాల్‌గున్నీ బయటకు రాగా, తెర వెనుక మరో ఇద్దరు అధికారులున్నారని తెలుస్తోంది. వీరి కాకుండా మరో 25 మంది ఖాకీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Perni Nani responded on kadambari jethwani incident
Perni Nani

ఈ ఎపిసోడ్ మొత్తానికి ఆనాటి రాజకీయ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయ‌ని స‌మాచారం. ఈ కేసుపై పూర్తి నివేదిక నాలుగురోజుల్లో ఇవ్వాలని భావించినప్పటికీ, మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ కేసు విష‌యంలో పేర్ని నాని స్పందిస్తూ.. అంతా ఒక డ్రామా అని నాని అన్నారు. ఈ కేసు నిందితుడితో తమ పార్టీకి సంబంధం లేదని తెలిపారు. ‘ఆ నటిపై ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా కేసులు ఉన్నాయి. ఆమెను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం కొంత మంది పోలీసులను టార్గెట్ చేస్తోంది. వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించాలనేది చంద్రబాబు కుట్ర. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా జరిగిన ఘటనను కావాలనే మాకు అంటగడుతున్నారు’ అని ఆరోపించారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

17 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago