Balakrishna : సినీ ప్రపంచంలో నందమూరి బాలకృష్ణకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమా చేసినా కూడా ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమాలో నటన ఇరగదీయడంలో బాలయ్యదే పైచేయి అని చెప్పవచ్చు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అనేక బాలయ్య మూవీలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే బాలకృష్ణ గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది హీరోలు ఇతర భాషలకు చెందిన సినిమాలను రీమేక్ చేస్తుంటారు. అయితే మీకు తెలుసా.. బాలకృష్ణ ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఒక్క సినిమాను కూడా రీమేక్ చేయలేదు. ఆయన సినిమాలనే చాలా మంది ఇతర భాషలకు చెందిన హీరోలు రీమేక్ చేశారు. సక్సెస్ సాధించారు. ఇక బాలయ్య 17 సినిమాల్లో డ్యుయల్ రోల్‌లో కనిపించారు. అలాగే అధినాయకుడు మూవీలో మూడు పాత్రల్లో నటించారు.
1987లో బాలకృష్ణ నటించిన సినిమాలు ఏకంగా 8 రిలీజ్ అవడం విశేషం. ఇక అవన్నీ హిట్ కావడం మరో విశేషం. ఇక బాలకృష్ణ నటించిన 71 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. అలాగే బాలయ్య ఇప్పటి వరకు 6 ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 3 నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. బాలయ్య సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సినిమాల గురించి ఫ్యాన్స్ మళ్లీ చర్చించుకుంటున్నారు. ఇక బాలకృష్ణ త్వరలోనే అఖండ 2 తో మన ముందుకు రానున్నారు. ఆయన రీసెంట్‌గా నటించిన వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. భగవంత్ కేసరి యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…