YS Sunitha Reddy : వివేకా హ‌త్య వెన‌క ఆయన హ‌స్తం ఉంది.. ప్ర‌జా తీర్పు కోస‌మే సాక్ష్యాలు బ‌య‌ట‌కి: సునీత‌

YS Sunitha Reddy : వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవం ఏమిటనే విషయంపై ఇప్ప‌టికీ సందేహాలు ఉన్నాయి. సీబీఐ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఫైనల్ చార్జిషీటులో ఏముందనే విషయం ఇప్పుడు అయోమయంగా తయారైంది. ఎందుకంటే ఫైనల్ చార్జిషీటులోని అంశాలు ఇవే అంటూ మీడియాలో పరస్పర విరుద్ధమైన కథనాలు కనిపించాయి. అయితే తాను న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేదని వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అవినాష్​తో నిందితులకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయనేందుకు కాల్ డేటానే నిదర్శనమన్నారు. హత్య జరిగిన సమయంలో అవినాష్ – ఎర్ర గంగిరెడ్డి మధ్య కాల్ సంభాషణ జరిగిందని, తెల్లవారుజామున జరిగిన కాల్ డేటా వివరాలు సీబీఐ ఇవ్వలేదని అన్నారు సునీత‌.

ముమ్మాటికీ వివేకాను హత్య చేయించింది అవినాష్ అని, సాక్ష్యాధారాలున్నాయంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్​లో సంచలన విషయాలు వెల్లడించారు. పైస్థాయిలో ఒత్తిళ్లు ఉన్నందునే వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగడం లేదని, సీబీఐ చేయాల్సింది ఇంకా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు..తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకాది గుండె పోటు అని ఎవరైనా అనుకుంటారా అని సునీత ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు రాత్రి, ఆ తర్వాత రోజు ఉదయం కాల్‌ డేటాతో పాటు గూగుల్‌ టేకౌట్‌, ఐపీడీఆర్‌ డేటాను సునీత వెల్లడించారు. మొదటి ఛార్జిషీట్‌లో సీబీఐ నలుగురి నిందితుల పేర్లు చెప్పిందన్న సునీత, ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ2 సునీల్ యాదవ్‌, ఏ3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ4 దస్తగిరి అని తెలిపారు.

YS Sunitha Reddy sensational comments on cm ys jagan and sakshi
YS Sunitha Reddy

ఏ1 ఎర్ర గంగిరెడ్డితో అవినాష్‌కు పరిచయం ఉందని, సునీల్‌ యాదవ్‌కు తమ్ముడు ఉన్నాడని అతడి పేరు కిరణ్‌ యాదవ్‌ అని అన్నారు. అవినాష్‌, భాస్కర్‌రెడ్డితో కిరణ్‌ యాదవ్‌ ఉన్న ఫొటోలు చూపించిన సునీత, ఏ3 ఉమాశంకర్‌రెడ్డితోనూ అవినాష్‌కు పరిచయం ఉందని అన్నారు. ఉమాశంకర్‌ రెడ్డికి అవినాష్‌ నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ వివరాలను సైతం సునీత చూపించారు. ఎం.వి.కృష్ణారెడ్డి వివేకాకు చాలా సన్నిహితుడన్న సునీత, శివ శంకర్‌ రెడ్డికి, ఎం.వి.కృష్ణారెడ్డి మధ్య ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయని పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డి ఫోన్‌ మార్చి 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ ఉదయం వరకు స్విచ్ఛాఫ్​లో ఉందని అన్నారు. గంగిరెడ్డి, సునీల్ యాదవ్​ల మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయని, ఐపీడీఆర్ డేటా ప్రకారం అర్ధరాత్రి 1.37 నిమిషాలకు గంగిరెడ్డి అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని తెలిపారు. అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల మధ్య నాలుగు కాల్స్ ఉన్నాయని, ఈ మధ్య సమయంలోనే వివేకానంద రెడ్డి హత్య జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హత్య జరిగిన తెల్లవారుజామున 4, 5 గంటల మధ్య చాలాసార్లు కాల్స్ చేశాడని, ఆ కాల్స్ ఎవరికి వెళ్లాయని ప్రశ్నించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago