Renu Desai : పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత రేణూ దేశాయ్ పూణే వెళ్లి అక్కడ పిల్లలని చదివించుకుంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం రేణూ దేశాయ్ తెలుగు మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్ ఇప్పుడు తరచూ కనిపిస్తూ తెగ సందడి చేస్తుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్, ఆ తరువాత కాస్ట్యూమ్ డిజైనర్‌గా కొన్ని సినిమాలకు పని చేసింది. రేణు దేశాయ్ వర్కింగ్ స్టైల్ నచ్చడంతో దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తొలి సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చారు. ఆ సమయంలోనే రేణూ దేశాయ్.. పవన్‌తో ప్రేమలో పడి కొన్నాళ్లపాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది.
పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత పూణేకి వెళ్లిన రేణూ దేశాయ్ ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. రేణు దేశాయ్ చాలాకాలం తరువాత తెలుగు సినిమాలో నటించింది. రవితేజ హీరోగా తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించి రీఎంట్రీ ఇచ్చింది . అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. రేణు దేశాయ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ సింబల్‌ను టాటూగా వేయించుకున్న ఫోటోను షేర్ చేసింది. దీంతో రేణూ దేశాయ్ బీజేపీకి మద్దతు ఇస్తోన్నట్టుగా అర్థం అవుతోంది.
మాటల కంటే ఫోటోలే ఎక్కువగా మాట్లాడుతుంటాయ్ అని ఓ పోస్ట్ వేసిన రేణూ దేశాయ్.. ఇలా తన చేతిపై వేయించుకున్న టాటూని చూపించింది. మౌనం పరం శీలం అంటూ టాటూని వేయించుకుంది. ఇక ఇందులోనే బీజేపీ సింబల్ అయిన కమలం పువ్వుని వేయించుకుంది. అంటే ఆమె బీజేపీకే మద్దతు ఇస్తున్నట్టుగా చెప్పకనే చెప్పేసిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ పోస్ట్ చూసి జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో మోడీ, బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నాను, ఏపీలో కూటమికే సపోర్ట్ ఇస్తున్నట్టు రేణూ దేశాయ్ ఎక్కడా క్లియర్‌గా చెప్పలేదు. కానీ నెటిజన్లు మాత్రం ఆ టాటూని, ఆ కమలం గుర్తుని చూసి ఎవరికి నచ్చినట్టు వారు ఊహించుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…