YS Sunitha Reddy : ప్రస్తుతం ఏపీలో రాజకీయం మరింత రంజుగా మారుతుంది. ఈ సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ వార్తలలో నిలుస్తుంది. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి రక్తంతో తడిచి ఉన్నాయని, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి ఆరోపించారు. తన తండ్రి రక్తంతో వైకాపా పార్టీ పునాదులు తడిసివున్నాయన్నారు. తన తండ్రిని హత్చ చేసిన హంతకులపై తాము న్యాయపోరాటం చేస్తుంటే తమపైనే నింద మోపుతారా అని ఆమె ప్రశ్నించారు. హత్యతో తన కుటుంబానికి సంబంధముంటే ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు.
వివేకానందరెడ్డి జీవితాంతం వైఎస్ఆర్ కోసమే పనిచేశారని చెప్పారు. ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. ఫ్యాక్షన్, హింసను తగ్గించాలని నిత్యం ఆలోచించేవారని చెప్పారు. “వివేకానంద రెడ్డి మనకి దూరమై ఐదేళ్లు అవుతుంది. ఆయనకు అంత కీడు ఎలా తలపెట్టారని ఆలోచిస్తున్నప్పుడే జగన్ సీఎం అయ్యారని మండిపడింది. ప్రజలందరికీ న్యాయం చేస్తానని ఆయన ప్రమాణస్వీకారం చేశారు. అది చూసి మనమంతా గర్వపడ్డాం. జగనన్నను ఒక ప్రశ్న అడుగుతున్నా.. అంతఃకరణశుద్ధిగా అంటే అర్థం తెలుసా? వివేకాను చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇప్పటివరకూ హంతకులకు శిక్షపడేలా ఎందుకు చేయలేదు.
మీ ప్రమాణాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదు.? మేం ఈ నేరం చేశామని చెప్పడం మీకు ఎబ్బెట్టుగా లేదా? ప్రభుత్వంలో ఉండి.. మాపై ఆరోపణలు చేయడమేంటి? హంతకులను పట్టిస్తే రూ.5 లక్షలు ఇస్తామని సీబీఐ ప్రకటించింది. జగనన్నా.. మమ్మల్ని పట్టించి ఆ బహుమతి అందుకోండి. అలాగే, జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డికి కూడా సునీత ప్రశ్నలు సంధించారు. పదేపదే మాపై ఆరోపణలు చేయడానికి మీకు సిగ్గుగా లేదా? సాక్షి పత్రికలో మాపై నిందలు వేస్తూ వార్తలు రాస్తున్నారు. సాక్షి చైర్ పర్సన్ భారతికి ఓ విన్నపం.. మీ వద్ద ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి. ఆధారాలు ఉండీ పోలీసులకు ఇవ్వకపోవడం నేరం. అన్నం పెట్టిన చేతిని నరకడం.. వ్యక్తిత్వం మీద బురద జల్లడం దారుణం. మాపై నిందలు వేసినా.. సీతాదేవిలా నిర్దోషిత్వం నిరూపించుకుంటాం. మీ కోసం నిరంతరం పని చేసిన వివేకాను మర్చిపోయారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…