YS Sharmila : పోటీకి సిద్ధం.. ఎక్క‌డి నుండో పోటీ చేస్తుందో చెప్పిన ష‌ర్మిళ‌..

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జ‌ర‌గ‌నుండ‌గా, ఈ సారి ఎవ‌రు గెలుస్తారు అనేది చ‌ర్చ‌నీయాంశం అయింది. రెండోసారి అధికారమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక.. ఎలాగైనా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ కూటమి) సరికొత్త జోష్ తో తాము సిద్ధమంటూ కదనరంగంలోకి అడుగేశాయి. అయితే సీట్ల ఎంపిక‌పై కూడా బాగానే క‌స‌ర‌త్తు న‌డుస్తుంది. ఇటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల సంగ్రామంలో స్పీడును పెంచాయి. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది.

వైఎస్ షర్మిలను పార్టీ చీఫ్ గా ప్రకటించిన నాటినుంచి దూకుడుగా ముందుకువెళ్తోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో అమలు చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో మాదిరిగా.. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పక్కా హామీలంటూ ఇటీవల విడుదల చేసింది. తాము ఎన్నికల్లో గెలిస్తే ఇవి పక్కాగా అమలు చేస్తామంటూ ఖర్గే సైతం ప్రకటించారు. అంతేకాకుండా.. ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. వైఎస్ షర్మిల ఎప్పటికైనా సీఎం అవుతారని చెప్పిన రేవంత్ రెడ్డి.. తనకు అండగా ఉంటానంటూ ప్రకటించారు.

YS Sharmila told her seat place
YS Sharmila

కడప ఎంపీగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మను బరిలోకి దింపాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే, సౌభాగ్యమ్మను కాంగ్రెస్ నుంచే పోటీ చేయించాలనే మరో ఆలోచన తాజాగా జరిగిన వివేకా సంస్మరణ సభలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం షర్మిలను కడప ఎంపీగా బరిలోకి దిగాలని సూచిస్తుండటంతో…వివేకా కుటుంబం నుంచి పోటీ ఉండదనే అంచనా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు షర్మిల ఎంపీగా పోటీ చేయాలంటూ హైకమాండ్ సూచిస్తుండడటంతో బరిలోకి దిగుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా విడుదల కానుంది. పులివెందుల నుంచి జగన్ పోటీ చేస్తుండంతో టీడీపీ అభ్యర్దిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా తేలలేదు. దీంతో, షర్మిల ఎంపీగానే పోటీ చేస్తారా..లేక ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగుతారా అనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago