Vallabhaneni Vamshi : రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే నాయకుల్లో ఒకరైన వల్లభనేని వంశీ ఒకరు. ఆయన టీడీపీ నుండి వైసీపిలోకి వచ్చి తిట్లదండంలోకి వెళుతున్నాడు. వంశీ కొద్ది నెలలుగా ఎక్కడా వినిపించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీని వీడిన వంశీ, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడానికి వైసీపీకి చక్కటి అస్త్రంగా ఉపయోగపడ్డారు.తీవ్రమైన విమర్శలు, ఆరోపణలతో టీడీపీ ముఖ్య నాయకుల్ని ఎడాపెడ తిట్టడంతోనే వల్లభనేని వంశీ బాగా పాపులర్ అయ్యారు. కొన్నేళ్ల క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబం మీద వంశీ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.
గన్నవరం నుంచి వల్లభనేని వంశీని తప్పిస్తారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధిని గన్నవరం వెళ్లాలని వైసీపీ నాయకత్వం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే వల్లభనేని వంశీని గన్నవరం తప్పించడానికే పార్టీ హైకమాండ్ సిద్ధమయినట్లేనా? అన్న అనుమానాలు బయలుదేరాయి. అయితే పార్ధసారధి మాత్రం గన్నవరం వెళ్లేందుకు సుతారమూ ఇష్టపడటం లేదు. దీంతో గన్నవరం పెద్దగా ఫోకస్ కాకపోయినా వల్లభనేని వంశీకి తిరిగి టిక్కెట్ ఇస్తే వైసీపీ నుంచి ఈసారి జరిగే ఎన్నికల్లో గెలవడం కష్టమని సర్వేలు కూడా చెబుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ స్థానంలో ఎవరికి టిక్కెట్ ఇస్తారన్న చర్చ జరుగుతుంది.
అయితే వంశీ ఓ విషయంలో ఫుల్ ఫైర్ అయ్యాడు. రేయ్ బేవర్స్ నా కొడకల్లారా అంటూ చంద్ర బాబు, నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని రమ్మంటే ఎవరెవరో వచ్చి ఏదోదో మాట్లాడుతున్నారంటూ వంశీ ఫైర్ అయ్యారు. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథిని గన్నవరంలో పోటీ చేయించాలని వైసీపీ భావించింది. ఆ పార్టీలో నెలకొన్నపరిణామాలతో విసిగి పోయిన పార్థసారథి టీడీపీలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. వంశీ మరోసారి పోటీ చేయించే ఉద్దేశం ఉంటే పార్థసారథి పేరు ఎందుకు తెరపైకి వస్తుందనే చర్చ కూడా వైసీపీ వర్గాల్లో ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…