YS Sharmila : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షర్మిళ కూడా ప్రచారంలో దూసుకుపోతుంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజక వర్గంలో పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తన సోదరి సునీతారెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసింది. తాను కడపలో ప్రచారం మొదలుపెట్టి కేవలం ఐదు రోజులే అయిందని, తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని చెప్పుకొచ్చిది. అవినాష్ రెడ్డిని మార్చాలన్న వైసీపీ ప్రయత్నాలు చూస్తుంటే… అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. సీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిని మార్చబోతున్నారని, ఆయన స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయని వైఎస్ షర్మిల అన్నారు.
అవినాశ్ ను మార్చాలనే ఆలోచనలో జగన్ ఉన్నారంటే… వివేకాను అవినాశ్ హత్య చేశాడని మీరు ఒప్పుకుంటున్నట్టేనా? సీబీఐ చెపుతున్నది నిజమే అని ఒప్పుకుంటున్నట్టేనా? అందుకే కడప స్థానం నుంచి అవినాశ్ ను మారుస్తున్నారా? అని ప్రశ్నించారు. సొంత బాబాయిని చంపిన హంతకుడికి మళ్ళీ ఎందుకు సీట్ ఇచ్చారని సీఎం జగన్ ను షర్మిల ప్రశ్నించారు. ప్రజలు నిజాలు తెలుసుకున్నారు అని ఎందుకు మార్చాలని చూస్తున్నారన్నారు. దీనిపై కడప ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు.సొంత బాబాయిని చంపిన వ్యక్తిని ఎందుకు వెనకేసుకు వస్తున్నారని జగన్ ను ఆమె ప్రశ్నించారు. ఐదేళ్లుగా హంతకుడు తప్పించుకు తిరుగుతున్నాడని, అవినాష్ రెడ్డి హంతకుడు అని సీబీఐ అన్ని ఆధారాలు బయట పెట్టిందని షర్మిల తెలిపారు.
అవినాష్ రెడ్డి దోషి అని తెలిసినా సీబీఐ ఆయన వెంట్రుక కూడా పీకలేక పోయిందని షర్మిల విమర్శలు గుప్పించారు. ఈ అన్యాయాన్ని ఎదురించేందుకే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాన్నారు. అన్యాయం ఒక వైపు, అధర్మం ఒకవైపు, ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, ఆ తాను 5 రోజులుగా కడపలో ప్రచారం చేస్తున్నానని, తమ ప్రచారానికి వైసిపీలో వణుకు పుడుతుందన్నారు. అందుకే అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. అవినాష్ రెడ్డిని ఉంచినా,మార్చినా జగన్ మాత్రం కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వివేకా ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే… సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చిత్రీకరించారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా చనిపోయినప్పుడు సీబీఐ ఎంక్వైరీ కోరిన జగన్… సీఎం అయిన తర్వాత మాట మార్చారని.. తాను సీబీఐ ఎంక్వైరీకి పోతే అవినాశ్ బీజేపీలోకి వెళ్తారని సునీతకు ఎందుకు చెప్పారో ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…