Nara Lokesh : జ‌గన్ ఇక‌నైన డ్రామాలు ఆపు అంటూ లోకేష్ ఫైర్

Nara Lokesh : ఏపీలో ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నాయి. వ‌చ్చే నెల‌లోనే ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్రచారం ఊపందుకుంది. ఒకరిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ఓటుకు రూ. 6 వేలు పంచుతారని ఆయన అన్నారు. లోకేశ్ డబ్బులు పంచినట్టు మన వైసీపీ అభ్యర్థి లావణ్య పంచలేదని… ఎందుకంటే లోకేశ్ దగ్గర ఉన్నట్టు లావణ్య దగ్గర డబ్బులు లేవని చెప్పారు. లోకేశ్ డబ్బులు ఇస్తే తీసుకోవాలని… అయితే ఓటు వేసే ముందు మాత్రం ఆలోచించాలని అన్నారు.

జూన్, జులై నెలల్లో చేయూత, నేతన్న హస్తం, అమ్మఒడిని ఎవరు ఇస్తున్నారో వారికే ఓటు వేయాలని సూచించారు. ఎవరు అధికారంలో ఉంటే పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందుతుందో ఆలోచించి వారికే ఓటు వేయాలని కోరారు. జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక జ‌గ‌న్‌పై నారా లోకేష్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తుండగా, మార్గమధ్యంలో రోడ్డు పక్కన ఆయన కోసం ఓ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడి కుటుంబం ఎదురుచూస్తుండడం, కృత్రిమ శ్వాస తీసుకుంటూ స్ట్రెచర్ పై ఉన్న ఆ రోగిని చూసి సీఎం జగన్ తన కాన్వాయ్ ని ఆపడం, ఆయన ఆ రోగి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితి పట్ల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం తాలూకు ఓ వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Nara Lokesh strong counter and angry on cm ys jagan
Nara Lokesh

నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా అంటూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. దిగజారుడు రాజకీయాల్లో నిన్ను కొట్టే వాడు దేశంలోనే లేడని నిరూపించావ్… ఇకనైనా ఈ డ్రామాలు ఆపు జగన్ అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి ఏపీలో ఈ సారి ఎల‌క్ష‌న్స్ మంచి ర‌స‌వ‌త్త‌రంగా అయితే ఉంటాయి. కూట‌మి విజ‌యం సాధిస్తుందా లేకుంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి స‌త్తా చాటుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago