YS Sharmila : ష‌ర్మిల కొడుకు నిశ్చితార్థంలో ఈ రెండు ప్ర‌ధానంగా హైలైట్.. అవేంటంటే..!

YS Sharmila : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థం కార్యక్రమం అట్టహాసంగా జ‌రిగింది.గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన ఈ ఫంక్షన్ లో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. షర్మిల ఆహ్వానం మేరకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడా రాజారెడ్డి-అట్లూరి ప్రియ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు..పవన్ రాక సందర్భంగా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో ఒక్కసారిగా కోలాహలం ఏర్పడింది. ఆయనకు షర్మిల-అనిల్ దంపతులు స్వాగతం పలికారు. త్వరలోనే పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న రాజారెడ్డి-ప్రియ జోడీకి పవన్ శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఈ ఎంగేజ్‌మెంట్‌లో వైఎస్ఆర్ కుటుంబంలోని విభేదాలు బయటపడ్డాయి. కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు ఆహ్వానించిన షర్మిల.. తన అన్న వైఎస్ జగన్, వదిన భారతిలను పట్టించుకోలేదు. కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు జగన్, షర్మిల ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. షర్మిల ఆమె భర్త అనిల్ ఇద్దరూ జగన్‌ను పట్టించుకోలేదు. ఫోటో దిగేందుకు రావాలని జగన్ పిలిచినా షర్మిల, అనిల్ రాలేదు. ఆ పక్కనే నిల్చున్నారు. దాంతో బొకే ఇచ్చి నిమిషంలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు జగన్, భారతి. ఇక ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో జగన్ కంటే కూడా అత్యంత ప్రాధాన్యత దక్కిన వ్యక్తి కేవీపీ రాంచందర్ రావు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డికి ఆత్మలా ఈయనని పిలుచుకునేవారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడు.

YS Sharmila son engagement cm ys jagan arrived
YS Sharmila

కేవీపీనే మొదటగా స్టేజిపైకి రావటం.. ఆయన సమక్షంలోనే వేడుక ప్రారంభం కావటం జరిగింది. షర్మిల, విజయమ్మలు కూడా కేవీపీకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఈ నిశ్చితార్ధ వేడుకలో 150రకాల వంటకాలు వండినట్టు సమాచారం. ఆంద్ర, తెలంగాణ రుచులను మిక్స్ చేసి అతిధులకు వడ్డించారట. అమెరికాలో ఎంఎస్ చదివుకుంటున్న షర్మిల తనయుడు రాజారెడ్డి తెలుగమ్మాయి ప్రియతో ప్రేమలో పడ్డాడు. గత నాలుగేళ్లుగా ప్రేమలో వున్న వీరు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యారు. జనవరి 18న అంటే నిన్న గురువారం నిశ్చితార్థం జరుపుకున్న రాజారెడ్డి-ప్రియ జోడి ఫిబ్రవరి 17న పెళ్లిపీటలు ఎక్కనున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago