YS Sharmila : కొడుకు, కూతురికి ఆస్తులు పంచిన ష‌ర్మిళ‌.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో అల‌ర్ట్..

YS Sharmila : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల అల‌ర్ట్ అవుతుంది. రీసెంట్‌గా ఇడుపులపాయలో తనపేరుపై ఉన్న కొన్ని ఆస్తులను తన కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలీల పేరుపై వైయస్ షర్మిల రిజిస్ట్రేషన్ చేయించారు. సడెన్‌గా షర్మిల తనపై ఉన్న ఆస్తులను కొడుకు, కూతురు పేరు మీదకు మార్చడం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చనీయాంశం అయింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న షర్మిల వెంటనే వేంపల్లెలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్పటికే సిద్ధంగా ఉన్న డాక్యుమెంట్ల మీద కొడుకు, కూతురితో కలిసి ఆమె సంతకాలు చేశారు. గతంలో తాను కొనుగోలు చేసిన ఒక నిమ్మతోటను సైతం కుమార్తె పేరు మీదనే రిజిస్ట్రర్ చేయించారు షర్మిల. త‌నపై ఉన్న ఆస్తులను కొన్నింటిని తన కొడుకు, కూతురు పేర్లకు బదలాయించడం చక చకా జరిగిపోయాయి. ఇడుపులపాయలో ఉన్న 9 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని కుమారుడు వైఎస్ రాజారెడ్డి పేరు మీదు రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేకాకుండా 2 ఎకరాల 12 సెంట్ల స్థలాన్ని కుమార్తె అంజలి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు షర్మిల.

YS Sharmila shared her assets and money to her son and daughter
YS Sharmila

స‌డెన్ గా ష‌ర్మిల చేసిన ఈ పని ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ష‌ర్మిల తన ఆస్తుల‌ని బ‌ద‌లాయించిందా, లేక పిల్లలు యుక్త వయసుకి రావడంతో ఈ పని చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక షర్మిల సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు రావడంకో స్దానికులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇక ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో ష‌ర్మిళ పాల్గొంటారు. ఇక త‌న పార్టీని ష‌ర్మిళ కాంగ్రెస్‌లో విలీనం చేయ‌నుంద‌నే టాక్ కూడా వినిపిస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago