Nagababu : ప్రస్తుతం పవన్ కళ్యాణ్, నాగబాబు రాజకీయాలలో ఉండగా వారిపై ప్రత్యర్ధులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బూతులు తిడుతూ, కులాల ప్రస్తావన తెస్తూ రాజకీయాలంటే విరక్తి పుట్టేలా చేస్తున్నారు. పెళ్లాలు, పెళ్లిళ్లు, పిల్లలు, తల్లులు గురించి విమర్శించుకుని ఒకరి బొక్కల్ని ఒకరు బయటపెట్టుకుంటున్నారు. మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి విమర్శించిన వారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి కులంపై కూడా కామెంట్ చేశారు.. పవన్ కళ్యాణ్ తల్లి రెల్లి కులస్తురాలని.. కానీ ఆయన తన తల్లి కులం గురించి ఎక్కడా చెప్పుకోడంటూ వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జనసేన నాయకుడు.. మెగా బ్రదర్ నాగబాబు.
గత ఎన్నికల సమయంలో రెల్లి కులాన్ని తాను దత్తత తీసుకుంటానని పవన్ చెప్పారని… ఎందుకంటే ఆ కులాన్ని మన సమాజం చాలా తక్కువ చేసి చూసిందని నాగబాబు అన్నారు. కాపు కులంలో పుట్టినందుకు తాను గర్వపడతానని, గర్వపడాలి కూడా అని చెప్పుకొచ్చారు. ఏ వ్యక్తి అయినా వారి కులంలో పుట్టినందుకు గర్వపడతాడని నాగబాబు అన్నారు. నిజంగా తమ తల్లి రెల్లి కులంలో పుట్టి ఉంటే తామంతా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవారమని నాగబాబు స్పష్టం చేశారు. . రెల్లి కులస్తులను సఫాయి కార్మికులు అంటారని… సమాజంలోని కుళ్లుని, చెత్తని, నీచాన్ని శుభ్రం చేసి, మనకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేది రెల్లి కులస్తులేనని ఆయన అన్నారు.
రెల్లి కులస్తులకి చేతులెత్తి దండం పెట్టాలని, వైసీపీ వాళ్లకు రెల్లి కులస్తులంటే లోకువయిపోయారని మండిపడ్డారు. ‘అరేయ్ పిచ్చోళ్లారా.. మా అమ్మ రెల్లి కులంలో పుట్టి ఉంటే బాధ పడంరా… సంతోషపడతాం రా’ అని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారని పెళ్లాలు, పెళ్లిళ్లు, తల్లులు, పిల్లల గురించి మాట్లాడుతున్నారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…