YS Sharmila : వైఎస్ జగన్, షర్మిల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకే ఇంటికి చెందిన వీరిరివురి మధ్య విబేధాలు ఉన్నాయని కొందరు చెబుతున్నమాట. ఇది పలు సందర్భాలలో కనిపించింది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాక వీరిద్దరు కలిసి కనిపించిన సందర్భాలు తక్కువ. వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా సీఎం జగన్… తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి వైఎస్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు. అంతకు ముందు వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.శనివారం ఉదయం వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.
ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఎవరికివారు వేర్వేరు సమయాల్లో వచ్చి నివాళులర్పించారు. వేరు వేరుగా నివాళులు అర్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతేడాది వైఎస్సార్ జయంతి రోజు కుటుంబం అంతా కలిసి నివాళులు అర్పించారు. వైయస్ వర్థంతి సందర్భంగా ఒకేసారి నివాళులర్పించినా..జగన్, షర్మిల మాట్లాడుకున్న సందర్భం కనపడలేదు. అయితే అంతకముందు ఏడాది మాత్రం జగన్ షర్మిల ఇద్దరు ఒకే కారులో కలిసి వచ్చారు. అన్నయ్య పక్కనే చెల్లెమ్మ కూర్చోవడం చూసి ప్రతి ఒక్కరు సంతోషించారు.
ఇక ఇప్పటికే జగన్, షర్మిల మధ్య విభేదాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు షర్మిల వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేస్తారనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. షర్మిలతో పాటు కాంగ్రెస్ పెద్దలు ఇడుపులపాయకు వస్తారని.. అక్కడే.. హస్తం పార్టీలో విలీనంపై షర్మిల తన అభిప్రాయాన్ని చెబుతుందనే చర్చ కాగా, అలాంటిదేమి లేదు. కాకపోతే వైఎస్సాఆర్ జయంతి రోజున షర్మిల రాహుల్ గాంధీ నాయకత్వం గురించి తన ట్వీట్‌లో ప్రస్తావించడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. వైఎస్ కుటుంబం.. మరీ ముఖ్యంగా వైఎస్ షర్మిల, విజయమ్మ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారనే ప్రచారానికి మరింతగా షర్మిల ట్వీట్ అవకాశం ఇచ్చింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…