Siddharth Roy Teaser : ఇటీవలి కాలంలో టాలీవుడ్ సినిమాలు కూడా హాలీవుడ్‌ని మించిన రేంజ్ లో బోల్డ్ కంటెంట్‌తో రూపొందుతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో బోల్డ్ సీన్స్ ఉన్నా కథలో బలం సినిమాను నడిపించింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. అంతేకాదు, ఈ సినిమాను హిందీ సహా పలు భాషల్లో రీమేక్ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ మార్క్ సినిమాను పోలి ఉన్న చిత్రాలు చాలా వచ్చాయి. కానీ, కంటెంట్‌లో బలం లేక అవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయాయి. అయితే, ఇప్పుడు అలాంటి ఛాయలు ఉన్న మరో సినిమా టాలీవుడ్‌లో వస్తోంది. అదే ‘సిద్ధార్థ్ రాయ్’.
ఇందులో ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం పొట్టపై పంచ్ ఇచ్చి.. ‘మన స్కూల్ బెంచ్‌లా ఎంత గట్టిగా ఉందోరా’ అని డైలాగ్ చెప్పిన బుడ్డోడు హీరోగా నటిస్తున్నాడు. అతడి పేరు దీపక్ సరోజ్. ‘ఆర్య’ సినిమాతో బాలనటుడిగా ప్రయాణం మొదలుపెట్టి పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన దీపక్ సరోజ్ ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో తన్వి నేగి హీరోయిన్. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వి.యేశస్వి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, ఇది చూసిన వారు మూవీ ఎంత వైల్డ్‌గా, బోల్డ్‌గా ఉంటుందో అర్ధమైంది. హీరోకి లాజిక్స్ చాలా ఎక్కువ. తిండి, నిద్ర, సెక్స్.. జీవితానికి ఈ మూడు ఉంటే చాలు అనుకుంటాడు. అయితే, తన జీవితంలోకి వచ్చిన ఒకమ్మాయి అతడిని నిజమైన ప్రేమ ఏంటో చూపిస్తుంది. ఆ తరవాత సిద్ధార్థ్ రాయ్ జీవితం ఎలా మారిందనేదే సినిమా. కొన్ని సన్నివేశాల్లో ‘అర్జున్ రెడ్డి’ని మించిపోయేలా ఉంది హీరో పాత్ర. సినిమాలో క్వాలిటీ ఉందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. కథని నమ్మి చేసిన సినిమా ఇది. ప్రతిఒక్కరూ కష్టపడి పని చేశారు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. సిద్ధార్థ్ రాయ్.. పైసా వసూల్ సినిమా’ అని దీపక్ సరోజ్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…