YS Jagan : జ‌గ‌న్ మ‌ళ్లీ పాద‌యాత్ర చేయ‌నున్నారా.. ఇందుకు ఆయ‌న స‌మాధానం ఏమిటి..?

YS Jagan : ఈ సారి జ‌రిగిన ఎన్నిక‌ల‌లో చంద్ర‌బాబు ఘోర ప‌రాజ‌యం చెందారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి వైసీపీ అధినేత జగన్ బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. మళ్లీ గట్టిగా నిలబడతామని చెప్పిన ఆయన.. వెంటనే పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఇంత వరకూ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఉన్న ఇంటినే పార్టీ ఆఫీసుగా మార్చారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసును ఖాళీ చేశారు. మరో చోట పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగుతున్నప్పటికీ.. పార్టీ ఆఫీసును తమ పాత క్యాంప్ ఆఫీసులోకే మార్చాలని నిర్ణయించుకున్నారు. అక్కడే పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు.తాడేపల్లిలో పార్టీకేంద్ర కార్యాలయం కూడా ఏర్పాటు కావడంతో జగన్ వద్దకు ఈ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయిన నేతలు వచ్చి జగన్ ను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు.

ఓటమికి గల కారణాలను జగన్ వారి నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఇంత దారుణంగా ఓటమి పాలు కావడానికి కారణాలతో పాటు భవిష్యత్ ప్రణాళికపై కూడా జగన్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలియవచ్చింది. ఓటమి ఎదురయినా నిలబడి పోరాడాలని కార్యకర్తలకు అండగా నిలవాలని నేతలకు జగన్ సూచిస్తున్నట్లు తెలిసింది. ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజాతీర్పును గౌరవిస్తూనే పోరాటం చేయడమే మనముందున్న మార్గమని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారితోనూ జగన్ మాట్లాడుతున్నారు. జిల్లాల్లో పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. అయితే ఇది ఓటమిపై పూర్తి స్థాయిలో చేస్తున్న నసమీక్ష కాదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తర్వాత జిల్లాల వారీగా ఓటమిపై జగన్ సమీక్ష నిర్వహిస్తారని అంటున్నారు. అధికారంంలో ఉండి.. పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చిన తర్వాత యాభై నుంచి నలభై శాతానికి ఓట్లు పడిపోవడంపై కూడా చర్చిస్తున్నారు.

YS Jagan response on again padayatra what he said
YS Jagan

జగన్ తమకు ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదని..ప్రజల తరపున నిలబడతామని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో జగన్ సలహాదారులు..సీఎంఓ అధికారుల తీరు పైన ఇప్పుడు ఓటమి తరువాత వైసీపీ నేతలు మండి పడుతున్నారు. ఐప్యాక్, వాలంటీర్ల వ్యవస్థ తమ గెలుపు అవకాశాలను దెబ్బ తీసిందని ఆక్రోశిస్తున్నారు. అయితే 2029 టార్గెట్‌గా జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నారు. 2019 ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ భారీ మెజారిటీతో గెలిచాడు అంటే పాద‌యాత్ర కూడా ముఖ్య కార‌ణం అని చెప్పాలి. ఈ ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ దారుణంగా ఓడిపోవ‌డంతో తిరిగి పాద‌యాత్ర‌తో జ‌నాలకి ద‌గ్గ‌ర‌గా ఉంటూ 2029 ఎన్నిక‌ల‌లో భారీ మెజారిటీతో గెల‌వాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago