Pawan Kalyan : బాహుబ‌లి సీన్ రిపీట్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే నేను అన్న స‌మ‌యంలో ద‌ద్ద‌రిల్లిన స‌భ‌..

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి తరపున శాసనసభాపక్షనేతగా చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబును కూటమి తరపున సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా .. ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ మ‌హోత్త‌ర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా అతిరథ మహారథులు తరలి వ‌చ్చారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ రియ‌ల్ లైఫ్‌లో మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసే స‌మ‌యంలో ఆయ‌న అభిమానులు, శ్రేయోభిలాషులు మోత మోగించారు.

సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆడియో ఫంక్షన్ అయినా.. సక్సెస్ మీట్ అయినా.. పవన్ వచ్చినా.. రాకపోయినా.. ఆయన అభిమానులు మాత్రం అస్సలు తగ్గరు. వచ్చిన దగ్గరనుంచి ఈవెంట్ అయ్యేవరకు.. పవన్ పవన్ అంటూ.. నినాదాలు చేస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో.. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం స్వీకారం చేస్తే ఎలా ఉంటుంది. ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప‌వన్ ఫ్యాన్స్ తో పాటు జనసేన నాయకులు, టీడీపీ నేతలు కూడా తోడయ్యారు. మరి ఇలాంటి సమయంలో ఆ ప్రాంగణం దద్దరిల్లింది. ఒక్కసారిగా బాహుబలి సీన్ రిపీట్ అయ్యింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ మహిష్మతి సామాజ్య సర్వ సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు.. మహిష్మతి ప్రజలు ఏ విధంగా ఉద్వేగానికి గురయ్యారో.. ఆ సామాజ్యాన్ని , మహిష్మతి పీఠాన్ని కదిలించిన సన్నివేశం ఆ సినిమాకే హైలేట్‌గా నిలిచింది.

Pawan Kalyan oath taking ceremony baahubali scene repeated
Pawan Kalyan

ఇప్పుడు అదేసీన్ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో రిపీట్ అయ్యింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవర్ స్టార్ ప్రమాణ స్వీకారం చేయగానే.. వేదిక.. ప్రాంగణం అంతా.. ఒక్కసారిగా కేరింతలతో దద్దరిల్లింది. టీడీపీ నాయకులు సైతం లేచి చేతులు ఊపుతూ… సందడి చేశారు. పవన్ ప్రమాణ స్వీకారానికి సభా ప్రాంగణంలో వచ్చిన రెస్పాన్స్ చూసి అక్కడికి వచ్చిన వేరే రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఇవాళ నెరవేరింది అంటూ పోస్టులు చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago