Yashoda Poster : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో నాగ చైతన్య, సమంత జంట ఒకటిగా ఉండేది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఊహించని విధంగా విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. విడాకులు తీసుకున్నప్పటి నుండి ఈ జంట ఎప్పుడు కలుస్తారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల సమంత ఆరోగ్యం బాగోలేని కారణంగా చైతూ ఆమెని కలిసాడని, సమంత ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు. అయితే తాజాగా యశోద పోస్టర్ ఒకటి పట్టుకొని నాగ చైతన్య అభిమానులు నానా రచ్చ చేస్తున్నారు.
పోస్టర్‌లో ఉన్న ఒక చిన్న పాయింట్‌ను పట్టుకొని.. నాగచైతన్యను ఉద్దేశించే చిత్ర యూనిట్ ఇలా చేసిందంటూ నెట్టింట కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. వివరాలలోకి వెళితే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం యశోద మంచి టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా సమంత కెరీర్‌లో మరో గొప్ప చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్ పేరుతో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను టీవీల్లో కూడా ప్రసారం చేస్తున్నారు. అయితే ఇక్కడే కొందరు ఓ విషయాన్ని పట్టుకొని హంగామా చేస్తున్నారు.
‘థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్’ (Thrilling Blockbuster)లో N,C లెటర్స్‌లో సమంత ఫొటోలు ఉండే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీంతో NC అంటే నాగచైతన్య అనే అర్థమని, చిత్రయూనిట్ కావాలనే ఈ విధంగా పోస్టర్‌ను డిజైన్ చేసి, నాగ చైతన్యను కించపరుస్తున్నారంటూ కొందరు అభిమానులు ఆరోపిస్తున్నారు. సమంత సూచనల మేరకే మేకర్స్ పోస్టర్ ను ఈ విధంగా డిజైన్ చేశారా? లేక సమంతకు తెలియకుండా ఈ విధంగా జరిగిందా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది. చాలామంది ఈ విషయాన్ని చిన్న విషయంగా భావించవచ్చని మేము మాత్రం చాలా హర్ట్ అయ్యామని నాగ చైతన్య ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…