Weight Loss Drink : గత కొన్నేళ్లుగా మన జీవనశైలిలో వచ్చిన మార్పులతో ఊబకాయం సమస్య పెరిగిపోతోంది. అధిక బరువు ఉండటం గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. బరువు పెరిగినంత సులువు కాదు బరువు తగ్గటం. ఎన్నో వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించినప్పటికీ కొందరు ఎంతకూ బరువు తగ్గరు. అయితే వెయిట్ లాస్ అవ్వడానికి ఓ మంచి మ్యాజిక్ డ్రింక్ గురించి తెలుసుకుందాం. కావాల్సిన ఇంగ్రేడియన్స్.. వాము, సోంపు, జీలకర్ర.
ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో చూద్దాం.. వాము, సోంపు, జీలకర్ర మూడింటిని ఒకొక్క స్పూన్ చొప్పున తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక గిన్నెలో కప్పున్నర నీటిని తీసుకొని దానిలో వాము, సోంపు, జీలకర్ర కలిపి చేసుకున్న పొడి ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపి 5 నిమిషాల పాటు మరిగించి గ్లాస్ లోకి వడగట్టి గోరువెచ్చగా అయ్యాక త్రాగాలి. ఈ డ్రింక్ ని క్రమం తప్పకుండా ప్రతి రోజు ఉదయం నెల రోజుల పాటు తీసుకోవాలి. ఈ డ్రింక్ ఉదయం పరగడుపున త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. త్రాగిన గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి.
ఈ డ్రింక్ త్రాగటం వలన మలబద్దకం మరియు గ్యాస్, ఎసిడిటీ సమస్య, కడుపు ఉబ్బరం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవటం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. వాము, సోంపు, జీలకర్ర మూడింటిని సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా ప్రతి రోజు ఈ డ్రింక్ త్రాగుతూ ఉంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు, అధిక బరువు సమస్య తొలగిపోతుంది. అంతేకాక శరీరానికి హానికరంగా ఉండే టాక్సీన్స్ ని బయటకు పంపటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…