Yamudiki Mogudu : య‌ముడికి మొగుడు చిత్రం ఎంత మందికి లైఫ్ ఇచ్చిందో తెలుసా..?

Yamudiki Mogudu : ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి  కెరీర్ ప్రారంభంలో చిన్నా చిత‌కా పాత్ర‌ల్లో న‌టించారు చిరంజీవి. ఆ త‌ర‌వాత తనకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని హీరోగా త‌న టాలెంట్ ను నిరూపించుకున్నాడు. వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో మంచి మంచి కథ అంశాలు కలిగి ఉన్న  చిత్రాల్లో న‌టించాడు. అలా చిరంజీవి న‌టించిన సినిమాల్లో యముడికి మొగుడు సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా చిరంజీవితో పాటూ ఎంతోమంది నటులకు లైఫ్ ఇచ్చింది.

సినిమాల్లో ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో చిరంజీవి మ‌రియు సుధాక‌ర్ రూమ్ మేట్స్ అన్న సంగ‌తి చాలామందికి తెలిసిన విషయమే. అయితే అప్ప‌టి వ‌ర‌కూ విల‌న్ పాత్ర‌లు చేసిన సుధాకర్ య‌ముడికి మొగుడు సినిమాలో క‌మెడియ‌న్ గా న‌టించారు. త‌నకంటూ ఒక ప్ర‌త్యేకమైన మ్యాన‌రిజంతో సుధాక‌ర్ ప్రేక్ష‌కుల‌ను కడుపుబ్బ న‌వ్వించేవారు. ఈ సినిమా త‌ర‌వాత సుధాక‌ర్ టాలీవుడ్ లో స్టార్ క‌మిడియ‌న్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా యముడికి మొగుడు సినిమా నిర్మాత‌ల్లో సుధాక‌ర్ కూడా ఒక‌రు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన  విజయశాంతి మరియు రాధా హీరోయిన్స్ గా నటించారు. కైకాల సత్యనారాయణ, రావు గోపాల్ రావు, గొల్లపూడి మారుతీ రావు, హరి ప్రసాద్, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య, అన్నపూర్ణ వంటి వారి ప్రధాన తారాగణంగా నటించారు.

Yamudiki Mogudu movie given life to these actors
Yamudiki Mogudu

ఈ సినిమాకు రాజ్ కోటి సంగీత దర్శకత్వం వహించారు. అప్పటిలో ఈ సినిమా ఆల్బ‌మ్ సూపర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో అందం విందోళం.. అధరం తాంబూలం..,  వాన‌జ‌ల్లు గిల్లుతుంటే ఎట్ట‌గ‌మ్మో పాట‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా త‌ర‌వాత కోటి టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా మారిపోయాడు. అంత‌కుముందు చిన్న సినిమాల‌కు మ్యూజిక్ అందించిన కోటికి  ఈ సినిమాతోనే లైఫ్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాతోనే చిరంజీవి మరో ఇద్ద‌రు మిత్ర‌లు నారాయ‌ణ‌రావు, హ‌రిప్ర‌సాద్ ల‌కు కూడా లైఫ్ వ‌చ్చింది. ఈ సినిమాకు చిరుతో పాటూ సుధాక‌ర్, హ‌రిప్ర‌సాద్, నారాయ‌ణ‌రావు, సుధాక‌ర్ క‌లిసి డైన‌మిక్ మూవీమేక‌ర్స్ అనే బ్యాన‌ర్ ప్రారంభించారు. సొంత బ్యాన‌ర్ లో య‌ముడికి మొగుడు సినిమాను నిర్మించి 1988 లో విడుదల చేసి ఘనవిజయాన్ని అందుకున్నారు. యముడికి మొగుడు చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ కోటికి, నిర్మాతగా, కమెడియన్ గా సుధాకర్ కి, నటులుగా హరి ప్రసాద్, నారాయణలకు మంచి గుర్తింపు వచ్చింది.

Share
Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago