నిమ‌జ్జ‌నంలో మ‌హిళా పోలీసుల సూప‌ర్భ్ డ్యాన్స్.. వీడియో వైర‌ల్..

పదకొండు రోజుల పాటు.. అంగరంగ వైభవంగా భక్తుల పూజలు అందుకున్న గణపయ్య.. తల్లి గంగమ్మ ఒడికి చేరుకున్న విష‌యం తెలిసిందే. గురువారం హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుక అంగరంగ వైభవంగా జర‌గ‌గా, సుమారు లక్ష విగ్రహాలు.. నిమజ్జనం జరిగాయి. ఇందుకోసం ఏకంగా హుస్సెన్‌ సాగర్‌ చుట్టూ.. ఏకంగా 30 క్రేన్లు పెట్టి.. వినాయకులను గంగమ్మ ఒడికి చేర్చారు.ఇక . మహానిమజ్జనాన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. నిమజ్జనం చూడటం కోసం తరలి వచ్చిన జనాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిపోయాయి. ఇక ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం.. మధ్యా‍హ్నం లోపే పూర్తి కావడంతో.. తరువాత నిమజ్జనం ప్రాసెస్‌ వేగంగా సాగింది. శుక్రవారం కూడా నిమజ్జనం కొన‌సాగింది.

పోలీసుల ప్రణాళిక ప్రకారం.. మహాగణపతి అయిన ఖైరతాబాద్ వినాయకున్ని మధ్యాహ్నం ఒంటిగంటలోపు నిమజ్జనం చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే చేశారు. దీంతో.. వాళ్లకు పెద్ద టాస్క్ కంప్లీట్ అయ్యింద‌ని చెప్పాలి.. ఇక మిగతావన్నీ లైన్‌గా వస్తూ.. నిమ‌జ్జ‌నం జరగాయి. అయితే.. పెద్ద టాస్కే సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ అయ్యిందన్న ఆనందమో.. లేదా డీజే చప్పుళ్లకు వచ్చిన ఊపో.. భక్తులు అడిగారనో కానీ.. పోలీసులు కూడా యువతతో కలిసి స్టెప్పులేశారు. ముందుగా మగ పోలీసులు డ్యాన్సులు వేశారు.. బ్రేక్ డ్యాన్సులతో ఉర్రూతలూగించి.. జనాలతో విజిల్స్ వేయించారు.అందుకు ముందు పోలీస్ అధికారులు కూడా మహగణపతి ముందు ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. అయితే.. మగ పోలీసులే కాదు.. మహిళా పోలీసులు కూడా డ్యాన్సులతో దుమ్ము దులిపేశారండోయ్.

women police dance in ganesh nimajjan video viral

నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఇద్దరు మహిళా పోలీసులు.. మిగతా యుతులతో కలిసి డీజే పాటలకు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేశారంటే.. అలా ఇలా కాదు.. డీజే గిప్పని గుద్దితే సౌండ్ గప్పని రావాలే.. అన్నట్టు తీన్మార్ పాటకు వాళ్లు చేసిన డ్యాన్సుకు అంద‌రు ఫిది అయ్యారు. లోపలున్న మాస్ మహారాణులు బయటికి వచ్చి మరీ స్టెప్పులేశారు. జస్ట్ ఒంటి మీద ఖాకీ డ్రెస్ ఉందని.. అక్కడితో వదిలి పెట్టారు కానీ.. లేకపోతే డీజేలు పగిలిపోయేవే.. అన్నట్టుగా డ్యాన్సుతో కుమ్మేశారు. పోలీస్ అక్క‌ల డ్యాన్స్‌కి దుమ్ము లేచిపోయింది.అందుకు సంబంధించిన వీడియో తెగ వైర‌ల్ అయింది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago