Nara Lokesh : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా వాడివేడిగా సాగాయి.చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ అరెస్ట్ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలో నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఐడీ అధికారులకు టీడీపీ యువనేత నారా లోకేష్ షేక్ హ్యాండ్ ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉన్న లోకేష్ వద్దకు సీఐడీ అధికారులు వెళ్లారు. లోకేష్‌కి సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకుని ఢిల్లీ ఎప్పుడొచ్చారని సీఐడీ అధికారులను లోకేష్ అడగడంతో వారు స్పందిస్తూ ఉదయమే వచ్చామంటూ బదులిచ్చారు.
ఇప్పటికే వాట్సాప్‌లో నోటీసు అందుకుని రిసీవడ్ అని రిప్లై కూడా పెట్టా కదా అని లోకేష్ అన్నారు. వాట్సాప్ మెసేజ్ చేరే లోపే తాము ఢిల్లీ వచ్చినందున భౌతికంగా కూడా నోటీసు ఇద్దామని వచ్చామని లోకేష్‌కు తెలిపారు.రాక రాక వచ్చినందున కాఫీ లేదా టీ ఆతిధ్యం తీసుకోవాలని సీఐడీ అధికారులను లోకేష్ కోరారు. నోటీసు అందుకున్నట్లు సంతకం పెట్టాలని కోరారు. నోటీసు చదవకుండా సంతకం ఎలా పెట్టామంటారని లోకేష్ ప్రశ్నించారు. నోటీసులోని పలు పదాల పట్ల లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ దశలోనే నేరస్థుడిగా ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కొన్ని వ్యాఖ్యాలు పొరపాటున తప్పు వచ్చాయని సీఐడీ అధికారులు వివరణ ఇచ్చారు. కట్, కాపీ, పేస్ట్ విధానం అమలు చేసినట్లు ఉన్నారంటూ సీఐడీ అధికారులతో లోకేష్ అన్నారు.
సీఐడీ నోటీసుల ప్రకారం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో అక్టోబర్ 4 ఉదయం 10 గంటలకు లోకేష్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో ఏ14గా ఉన్న లోకేష్ ను విచారించిన తర్వాత సీఐడీ తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ కేసులో అక్టోబర్ 4 వరకూ లోకేష్ ను అరెస్టు చేయకుండా సీఐడీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అక్టోబర్ 4న విచారణకు హాజరైనా లోకేష్ ను అరెస్టు చేయకపోవచ్చని తెలుస్తోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…