Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బావమరిది అయినటువంటి యంగ్ హీరో నర్నె నితిన్ హీరోగా పరిచయం అవుతూ నటించిన చిత్రం “మ్యాడ్”. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ డ్రామా అయితే మొదట టీజర్ తోనే మంచి అటెన్షన్ ని తెచ్చుకుంది. ఇక ఇప్పుడు అయితే మేకర్స్ ఈ సినిమా తాలూకా ట్రైలర్ ని లాంచ్ చేశారు. మరి ఈ ట్రైలర్ కూడా మంచి ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పాలి. ముగ్గురు ఫ్రెండ్స్ నడుమ జెనరేట్ అయ్యే ఫన్ అలాగే కాలేజ్ సీక్వెన్స్ అన్నీ మంచి హిలేరియస్ గా అనిపిస్తున్నాయి. అలానే భీమ్స్ సంగీతం కూడా ఈ ట్రైలర్ లో బావుంది. ఇక హీరో నితిన్ డీసెంట్ లుక్స్ అండ్ యాక్టింగ్ తో కనిపిస్తున్నాడు.
యాక్షన్ లాంటివి ఏమీ లేకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ తోనే కట్ చేసిన ఈ టీజర్ లో మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కూడా ఓ పాత్రలో కనిపించడం అని చెప్పాలి. ఇలా దేనికదే మంచి ఫన్ తో అయితే ఈ ట్రైలర్ వచ్చింది. ఇక ఈ అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది. మనోజ్, అశోక్, దేవేందర్‌ల మిత్రత్రయం గురించి చూపించే ఈ మ్యాడ్ అందరినీ నవ్వించేలానే కనిపిస్తోంది. ఇక తన భార్య సోదరుడు నితిన్ నార్నే హీరోగా రాబోతోన్న క్రమంలో తన వంతుగా ప్రమోట్ చేసేందుకు ఎన్టీఆర్ వచ్చాడు. మ్యాడ్ ట్రైలర్ మూవీని లాంచ్ చేసి తన బామ్మర్దికి విషెస్ అందించాడు ఎన్టీఆర్. ఇక ఈ ట్రైలర్ లాంచ్ చేసిన క్రమంలో తీసిన ఫోటోలు, అందులో ఎన్టీఆర్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. ఏం ఉన్నాడ్రా బాబు అంటూ అందరూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశామని కెమెరామెన్ రత్నవేలు వేసిన పోస్ట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. దేవర షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్లను రత్నవేలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉన్నాడు. నిన్నా, మొన్నా ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ బాగానే ట్రెండ్ అయింది. దేవరలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో ఉంటాడన్నట్టుగా ఓ ఫ్యాన్ క్రియేట్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. దేవర, వార్ 2 చిత్రాలతో ఎన్టీఆర్ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…