ఇటీవలి కాలంలో వైవాహిక బంధానికి వాల్యూ లేకుండా పోయింది. చిన్న చిన్న కారణాలకి భార్య భర్తలు విడిపోవడం, వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడం వంటివి ఎక్కువగా మనం చూస్తున్నాం. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావిం చిన భార్య, ప్రియుడితో కలసి భర్తను హత్య చేసింది..మదనపల్లె పట్టణం రామిరెడ్డిలేఅవుట్‌లో నివాసముంటున్న వెంకటశివ, రమణమ్మ లు భార్యభర్తలు. వారి స్వగ్రామం కలకడ మండలం సింగన ఒడ్డుపల్లె. ఉపాధి నిమిత్తం ఏడాదన్నర క్రితం ఆకుటుంబం మదన పల్లెకు రాగా, ఈ దంపతులు టమెటా మార్కెట్‌లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే రమణమ్మ మార్కెట్ యార్డ్‌లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నషేక్ బషీర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అతనితో ఇంటి పక్కన ఉన్న గగన్ అనే 21 ఏళ్ల వ్యక్తితోను ఎఫైర్ నడుపుతుంది.
ఈ ఇద్దరు ప్రియులతో రమణమ్మ సహజీవనం చేస్తుండేది. ఏడాదిగా ఇది కొనసాగుగుతుండగా.. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన వెంకట శివ అతని భార్య గగన్‌లో కలిసి ఉండడాన్ని చూసి ఆగ్రహించాడు. రమణమ్మపై ప్రశ్నల వర్షం కురిపించారు వెంకటశివ. గగన్ గురించి నిలదీశాడు. దీంతో రగిలిపోయిన రమణమ్మ, గగన్ ఇద్దరు కలిసి వెంకట శివ తలపై రోకలిబండతో కొట్టారు. అంతేకాకుండా గగన్ అక్క బిందుప్రియ సహాయంతో వెంకట శివ మెడకు తాడు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య రమణమ్మ .. తన భర్త మద్యం సేవించి కిందకు పడి తలకు బలమైన గాయం తగిలించుకొని ఇంటికి వచ్చాడని, ఎవరు కొట్టారో ఏమైందో తనకు తెలియదని స్టోరీ అల్లింది.
ఆటోలో భర్త మృతదేహాన్ని స్వగ్రామం సింగనొడ్డుపల్లెకు తీసుకెళ్లింది. అంతలో తల, మెడపై గాయాలు ఉండటాన్ని గమనించి, రమణమ్మను ప్రశ్నించారు. తనదైన శైలిలో భర్త అన్న వెంకటరమణ ఆమెను నిలదీయడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కుటుంబీకు లు కలకడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మదనపల్లె పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ మహబూబ్ బాషా..సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. రమణమ్మను పోలీసులు విచారించగా..అసలు నిజం బయటపడింది. రమణమ్మ చెప్పిన విషయాలు చూస్తే పోలీసులే అవాక్కైనట్లు తెలిపారు. 20 గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులు రమణమ్మ, గగన్, బిందుప్రియ లను అరెస్టు చేశారు. షేక్ బషీర్ భాష పరారీలో ఉన్నట్లు డి.ఎస్.పి కేశప్ప చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…