Chandra Babu : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా ఆయనకి మధ్యంతర బెయిల్ లభించగా, మంగళవారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలై రోడ్డుమార్గంలో సుమారు 13 గంటలపాటు ప్రయాణించి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అమరావతి రైతులు బాబు కు ఘనస్వాగతం పలికారు. రాజధాని రైతులు గుమ్మడికాయతో చంద్రబాబుకు దిష్టి తీశారు.
ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు భావోద్వేగాలకు లోనయ్యారు. కేసుల్లో అక్రమంగా ఇరికించారంటూ బాబును వారంతా ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబునాయుడు కూడా కొంత భావోద్వేగానికి గురయ్యారు. వారికి ధైర్యం చెప్పారు. మనకు అంతా మంచే జరుగుతుందని, ధైర్యంగా ఉండాలన్నారు. తొలుత ఇంటికి చేరుకున్న అనంతరం సతీమణి భువనేశ్వరి హారతిచ్చి స్వాగతం పలికారు.. అనంతరం ఆమె దిష్టి తీశారు. మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని గుమ్మడికాయలు కొట్టారు. అనంతరం చంద్రబాబు టీడీపీ నేతల్ని కలిశారు.. వారిని ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబును చూసి పలువురు నేతలు భావోద్వేగానికి గురయ్యారు.
ఇంటికి చేరుకున్న అనంతరం సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు పూజలు కూడా చేశారు. అయితే చంద్రబాబుకి దారిపొడవునా 45ఏళ్ల రాజకీయ జీవితంలో కనీవినీ ఎరుగని రీతి చంద్రబాబునాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రయాణం ఇంత సుదీర్ఘంగా సాగడంపై చంద్రబాబు పోలీసులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించగా అభిమానులు పెద్ద ఎత్తున రావడంతోనే జాప్యం జరుగుతోందని వారిని ఒత్తిడి చేస్తే శాంతిభద్రత సమస్య వస్తుందని పోలీసులు తెలిపారని సమాచారం. రాజమండ్రి నుంచి బయలుదేరిన తర్వాత లాలాచెరువు, మోరంపూడి, బొమ్మూరు, వేమగిరి, జొన్నాడ సెంటర్, రావులపాలెం, సిద్ధాంతం, పెరవలి, తాడేపల్లి గూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, రామవరప్పాడు రింగ్, బెంజిసర్కిల్, కనకదుర్గ వారధి, తాడేపల్లి మీదుగా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…