Nagababu : ఎట్టకేలకి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ పెళ్లిగా మారింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచారు. దాంతో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. పెళ్లి తంతు ముగిశాక ఇద్దరూ దేవుడికి నమస్కరించారు. ముహూర్తం ప్రకారం సాయంత్రం ఏడు గంటల 18 నిమిషాలకు వీరి వివాహం జరిగింది. చాలా లావిష్ మ్యానర్‌లో, గ్రాండియర్‌గా వరుణ్‌లవ్ పెళ్లి వేడుక జరగడం విశేషం. నాగబాబు తనయుడి వివాహ వేడుకకు వారి సోదరులు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో పాటు రాంచరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్.. లావణ్య త్రిపాఠి కుటుంసభ్యులు, మరికొందరు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
ఇటలీలో మూడు రోజులపాటు వరుణ్‌లవ్ మ్యారేజ్ వేడుక నిర్వహించారు. అక్టోబర్ 30 కాక్‌టెయిల్ పార్టీ, 31న హల్దీ, మెహందీ వేడుక నిర్వహించారు. నవంబర్ 1 న గ్రాండ్‌గా పెళ్లి వేడుక చేశారు. వరుణ్ తేజ్, లావణ్య ల పెళ్లి ఇటలీలో జరిగింది. మొదటిసారి ఈ జంట ఇటలీలో తమ లవ్ ప్రపోజ్ చేసుకున్న నేపథ్యంలో మొదటిసారి కలుసుకున్న ప్లేస్‌కి గుర్తుగా ఈ ప్లేస్‌లోనే తమ పెళ్లి వేడుక నిర్వహించుకున్నారు. ఇటలీలోని ఈ టుస్కానీ ప్లేస్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఇది ఎనిమిదవ శతాబ్దానికి చెందిన పురాతన గ్రామం కావడం విశేషం. హిస్టారికల్‌గా బాగా పేరు సంపాదించింది. అత్యద్భుతమైన గ్రీనరీకి నెలవుగా నిలుస్తుంది. పెళ్లి వేదిక వద్దకి వరుణ్ తేజ్, లావణ్య లగ్జరీ కారులు రాయల్ లుక్‌లో ఎంట్రీ ఇవ్వడం విశేషం.
ఇందులో మెగా ఫ్యామిలీ అంతా వరుణ్‌లవ్ లను స్వాగతించారు. అనంతరం వేదిక వద్ద డాన్సులతో హోరెత్తించారు. నాగబాబు, వరుణ్ తల్లి, నిహారిక వంటి వారు సంబరాల్లో మునిగిపోయారు. ఇందులో పవన్ కళ్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. నవంబర్ 3వరకు వీరంతా ఇటలీలోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కి రానున్నారు. నవంబర్ 5న ఎన్ కన్వెన్షన్‌లో జరిగే రిసెప్షన్ వేడుకకి సినిమా ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా తరలి రానున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…