Janasena : ఈ సారి ఓట్లు చీలకుండా జనసేన చాలా కీలకంగా పని చేసింది. జనసేన పార్టీ 2014లో మాదిరిగా 2024లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీతో కూటమిగా బరిలో దిగింది. 2014లో జనసేన పార్టీ పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ బీఎస్పీ, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని రాజోలు సీటు మాత్రమే గెలుచుకున్న ఈ పార్టీ చేతులు కాల్చుకుంది. ఆ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన పవన్ కళ్యాణ్.. గాజువాక, భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి ఓడిపోవడం సంచలనం అయింది.
ఈ సారి ఎన్నికల్లో ఏపీలో అధికార పీఠంపై కూర్చున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డిని దింపడమే లక్ష్యంగా తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ సారి ఎన్నికల్లో గతంలో కంటే ఓట్లు శాతంతో పాటు జనసేనకు మంచి సీట్లు పెరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కచ్చితంగా గెలిచే స్థానాలివే అంటూ 11 అసెంబ్లీ స్థానాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ 11 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం, నాదెండ్ల మనోహర్ బరిలో నిలిచిన తెనాలి నియోజకవర్గాలతో పాటు మరో 9 ఉన్నాయి. అవి చూస్తే అనకాపల్లి, పెందుర్తి, కాకినాడ రూరల్, నర్సాపురం, యలమంచిలి, పి.గన్నవరం, భీమవరం, తాడేపల్లి గూడెం, అవనిగడ్డ ఉన్నాయి.
అయితే తనను దత్త పుత్రుడున్నా.. ప్యాకేజీ స్టార్ అన్నా.. అవేమి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ కూటమి తరుపున బలంగా పోరాడారు. ముఖ్యంగా ఏపీలో మూడు పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేయడం వెనక పవన్ కళ్యాణ్ కృషి ఉంది. ఒకవేళ కూటమి అధికారంలో వస్తే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్‌కే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అందుకుగాను పవన్ పార్టీకి ఆరు మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. రెవిన్యూ, నీటి పారుదల, పౌర సరఫరాలుతో పాటు మరో మూడు మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణ, కందుల దుర్గేష్, దేవ వరప్రసాద్, గిడ్డి సత్యనారాయణ మంత్రి పదవులు దక్కించుకునేందుకు ముందు వరసలో ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…