Actress Kavitha : సీనియర్ నటి కవిత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 11 ఏళ్ల ప్రాయంలోనే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటన మొదలు పెట్టగా, తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి లాంటి దిగ్గజాల చిత్రాల్లో కీలక పాత్ర పోషించి మెప్పించింది. హీరోయిన్‌గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను ఈమె తన అభినయంతో మెప్పించింది. అయితే వెండితెరపై కవిత జీవితం సజావుగానే సాగినట్టు కనిపించిన కూడా ఎన్నో ఒడిదుడుకులతో ఆమె లైఫ్ సాగింది. గతంలో కవిత మరణించిందని వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. కొన్నిరోజులు యూట్యూబ్ కు కనిపించకపోతే బతికున్నవారిని కూడా చంపేస్తున్న విషయం తెల్సిందే. తన మరణ వార్తలను ఆమె ఖండించింది. ఇలాంటి చెత్త వార్తలు రాయొద్దు అని చెప్పడంతో అప్పట్లో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
కోవిడ్ సమయంలో కవిత ఒక్కసారిగా తన భర్త, కొడుకుని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ విషాదాల నుంచి కవిత ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో కవిత తన కుటుంబం గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. తన ఫ్యామిలిలో ముందు నుంచి విషాదకర సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయని కవిత అన్నారు. చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చాను. పెళ్లి కూడా త్వరగానే చేశారు. ఆ సమయంలో ప్రేమ గురించి పెద్దగా తెలియదు. కానీ నాకు కాబోయే భర్త సూపర్ స్టార్ కృష్ణ లాగా ఉండాలి.. రిషి కపూర్ లాగా ఉండాలి అని కలలు కనేదాన్ని. నా భర్తని పెళ్ళయాక ప్రేమించా. కవిత భర్త దశరథరాజ్.
పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశాక మా ఆయనకి ఒక కండిషన్ పెట్టా. నేను పిల్లలని కనను అని చెప్పా. జోక్ చేస్తోంది అనుకుని ఆయన పట్టించుకోలేదు. పెళ్లి జరిగింది. మా అత్తగారేమో పిల్లలని త్వరగా కనాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పింది. మా అమ్మకి మాత్రం నేను పిల్లల్ని కనను ని చెప్పా. ఎందుకమ్మా అలా అంటావు.. పిల్లలు ఉండాలి కదా అని చెప్పింది. అందుకు కారణం మా తమ్ముడు చనిపోవడం. వాడు చనిపోయాక ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేదు. ఆ సంఘటన నా మైండ్ లో నాటుకుపోయింది. అతన్ని మర్చిపోలేక.. అలాగే నాకు అవుతుందని పిల్లలు వద్దు అని చెప్పాను. మా అత్తగారు పిల్లల్ని ఎప్పుడు కంటావ్ అని అడిగినప్పుడల్లా.. మా అమ్మ దగ్గరకు వెళ్లి పిల్లలు వద్దు అని చెప్పేదాన్ని. పిల్లలు పుడితేనే కదా చనిపోయేది.. పుట్టకపోతే ఏం ఉండదు కదా అని చెప్తే అందరూ ధైర్యం చెప్పారు. చివరికి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నా కూతురు పుట్టాకా జీవితం మారిపోయింది. ఆమె నా ప్రపంచం. మొత్తం నాకు ముగ్గురు పిల్లలు. కరోనా సమయంలో నా భర్త, కొడుకు చనిపోయారు. వారి లేని లోటు నాకు ఇంకా తెలుస్తోంది” అని కవిత కన్నీళ్లు పెట్టుకుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…