Rishab Shetty : కేజిఎఫ్ సినిమా తర్వాత అదే రేంజ్ లో ప్యాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ చిత్రం కాంతార. ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిషబ్ శెట్టి హీరోగా మాత్రమే కాక డైరెక్టర్ గా కూడా వ్యవహరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడలో మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా.. కాంతారా 2 రూపొందుతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హోంబలే ఫిలింస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై కూడా.. భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప, సలార్ వంటి సినిమాల సీక్వెల్స్ తో పాటు.. కాంతారా సీక్వెల్ కోసం కూడా.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాంతార సీక్వెల్‌లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే రిషబ్ శెట్టికి సంబంధించిన పలు విషయాలు నెట్టింట వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. రిషబ్ శెట్టికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడీయాలో యాక్టివ్‌గా ఉండే అతను తరచూ తన ఫ్యామిలీతో కలిసి ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. ఇటీవల రిషబ్ శెట్టి తన కూతురు రాధ్యకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు . చిక్కమంగళూరు జిల్లాలోని శృంగేరి శారదా మఠంలో ఈ వేడుక నిర్వహించారు. అయితే తమ ముద్దుల కూతురికి అక్షర అభ్యాసం పూర్తియిందంటూ రిషబ్ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఫ్యామిలీ చూడముచ్చటగా ఉందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కాంతార2 సి నిమా షూటింగ్ కోసం రిషబ్ శెట్టి చాలా బాగా కష్టపడుతున్నారట. కాంతారా కంటే ఈ సినిమాని ఎక్కువ బడ్జెట్ తో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై రిషబ్ కి పూర్తి నమ్మకంగా ఉందంట ఈ చిత్రం కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారట ఈ హీరో. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం 200×200 అడుగుల వైశాల్యంతో కుందాపుర ప్రపంచాన్ని.. సెట్ రూపంలో పునః సృష్టి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అడవి బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ కోసం.. ఈ సెట్ ను ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…