ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కాగా, జనవరి 13న చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. నిన్న విశాఖపట్నంలో అత్యంత ఘనంగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్‌కు గైర్హాజరైన శృతిహాసన్‌ను ఎవరో బెదిరించారంటూ చిరంజీవి చెప్పడం కలకలం రేపుతోంది.
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన వీరసింహారెడ్డి మూవీ ఈవెంట్‌లో శృతి సందడి చేసింది. ఇక వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు హాజరు కావల్సిన శృతిహాసన్ ఎందుకు హాజరుకాలేదు. ఈ విషయంపై చిరు కీలక విషయాలు వెల్లడించారు. ఆరోగ్యం బాగాలేదని శృతిహాసన్ తనకు ఫోన్ చేసి చెప్పిందన్నారు. కానీ ఆ అమ్మాయిని ఈవెంట్‌కు రాకుండా ఎవరో బెదిరించారంటూ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంట్లో నలతగా ఉందని చెప్పిందన్నారు. కరోనా కాకుండా ఉండాలని కోరుకుంటున్నానని ఆమె పేర్కొన్నట్టు చిరు చెప్పారు.
అసలు తన ఒంగోలులో ఏం తినిందో ఏంటో లేదంటు ఆమెను ఎవరైనా బ్లాక్ మెయిల్ ఏమన్నా చేశారేమో,” అంటూ శృతిహాసన్ గురించి జోక్ చేశారు చిరంజీవి. దీంతో అక్కడున్న ప్రేక్షకులు కూడా నవ్వేశారు. సినిమాలో శృతిహాసన్ అద్భుతంగా నటించిందని..చలిలో వణుకుతూ శ్రీదేవి పాటలో మెరిసిందన్నారు. అంత చలిలో కూడా చీరలో శృతిహాసన్ చేసిన స్టెప్పులకు హ్యాట్సాఫ్ అన్నారు. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న థియేటర్లలో విడుదల కాబోతోంది. మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…