తాను అందుక‌నే అలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌డం లేదంటున్న వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్

త‌మిళ ముద్దుగుమ్మ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. దక్షిణాది చిత్రపరిశ్రమలో యంగ్ అండ్ బ్యూటిఫుల్ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా రాణిస్తూనే విల‌న్‌గా అద‌ర‌గొడుతుంది. . స్టార్ హీరోలకు ఎదురెళ్లి.. విలనిజం చూపించడంలో డేరింగ్ నటి అని చెప్పాలి.. మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టిన వ‌ర‌ల‌క్ష్మీ.. అల్లరి న‌రేష్ నాంది సినిమాలోను త‌న న‌ట‌న‌తో న‌టించి మెప్పించింది. ముందుగా హీరోయిన్‌గా న‌టించిన వ‌ర‌ల‌క్ష్మీ ఆ త‌ర్వాత విల‌న్‌గా మారింది.

తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తోంది వ‌ర‌ల‌క్ష్మీ. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న వీరిసింహా రెడ్డి సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అయితే ఆమె విలన్ పాత్రలు.. సహాయ నటిగా కనిపించడానికి గల కారణాలను బయటపెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి తాను గ్లామర్ పాత్రలు చేయకపోవడానికి కారణాన్ని చెప్పుకొచ్చింది.

varalaxmi sarathkumar told why she is not doing those roles

గ్లామర్ పాత్రలు తనకు వర్కౌట్ కాదని భావించానని చెప్పిన వ‌ర‌ల‌క్ష్మీ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి పాత్రలు చేయడానికి చాలా మంది ఉన్నారని.. అందుకే తాను ప్రతినాయిక బాటను ఎంచుకున్నానని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో తనకు డైరెక్టర్ బాల గురువు అని తెలిపారు. ఆయన దర్శకత్వంలో తారై తప్పట్టై చిత్రంలో గరగాటకారిగా నటించి ప్రశంసలు అందుకున్నట్లు చెప్పారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో తనను ఓ సన్నివేశంలో కొట్టారని.. అందులో తను నటించడం పూర్తైన డైరెక్టర్ బాలా కట్ చెప్పడం మర్చిపోయాడని.. వాళ్లు తనను కొట్టగానే బాలా షాకయ్యాడని ఆ సినిమా చాలా బాగా వచ్చిందని.. వెంటనే తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని.. ఆ ఘటన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని వ‌ర‌ల‌క్ష్మీ చెప్పుకొచ్చింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago