నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అశేష ప్రేక్షకాదరణ పొందాడు బాలయ్య. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించిన బాలయ్య ఇప్పుడు వీరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని రూపొందిస్తోన్నఈ చిత్రంలో నందమూరి నటసింహం బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటిస్తుండగా..మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో దునియా విజయ్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు.
ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా.., మరోవైపు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే జనవరి 6న ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ వేడుకలో బాలయ్య మనవడు ఆర్య వీర్ కు సంబంధించిన వీడియోను ప్లే చేసారు. ఇందులో ఆర్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. ‘‘భయం నా బయోడేటాలో లేదురా’’ అనే డైలాగ్ చెప్పి శభాష్ అనిపించాడు. ఈ వీడియో ‘వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్లే కావడంతోనే బాలయ్య అభిమానులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు.
ఈ వీడియో చూసి నందమూరి ఫ్యామిలీ నుంచి మరో సినీ వారసుడు రాబోతున్నాడంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజస్విని కుమారుడు ఆర్యవీర్ అప్పుడప్పుడు పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొడుతూనే ఉంటాడు. ఇక బాలకృష్ణ మనవడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదైన బాలయ్య తన కొడుకుని పరిచయం చేయనున్నాడా అంటూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…