కొన్ని సినిమాలు చూసిన వెంటనే విపరీతంగా నచ్చుతాయి. మరికొన్ని సినిమాలు అప్పుడు అర్థం కాకపోయినా ఇంకోసారి ఎప్పుడైనా చూసినప్పుడు ఏదో కొత్తదనం ఉందనిపిస్తుంది. అప్పుడేందుకు హిట్ అవ్వలేదు అనిపిస్తుంది. అలాంటి సినిమాల లిస్ట్ లో మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా సినిమా కూడా ఒకటి. ఈ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఇంతకు ముందు అతడు నటించాడు. అతడు బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ఖలేజా థియేటర్ లో మెప్పించకపోయినా టెలివిజన్ లో ఆకట్టుకుంది.
కొంతకాలానికి ఆ సినిమాలోని మ్యాజిక్ ను ప్రేక్షకులు గుర్తించారు. అయితే ఖలేజా ఫ్లాప్ అవ్వడానికి 5 కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దా.. 1.సినిమాలోని సీరియస్ సీన్లను కూడా కామెడీగా చూపించేసరికి ప్రేక్షకుడికి విసుగు పుట్టింది. అంతే కాకుండా కొన్నిసార్లు కామెడీ కూడా బోర్ కొట్టేలా ఉంటుంది. 2. త్రివిక్రమ్ మహేశ్ బాబు సినిమా అనగానే అతడు రేంజ్ లో ఊహించుకున్నారు. కానీ ఆ రేంజ్ లో సినిమా లేకపోవడంతో నిరాశచెందారు. 3. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే దేవుడని చెప్పే ప్రయత్నం త్రివిక్రమ్ చేశాడు.
కానీ ఆ పాయింట్ సరిగ్గా ప్రజెంట్ చేయలేదు. ఈ క్రమంలో ప్రతిసారి దేవుడు అని చెప్పడంతో మనిషి దేవుడెలా అవుతాడు అనే కన్ఫ్యూజన్ లో ప్రేక్షకులు పడిపోయారు. 4. ఏ సినిమా అయినా ఒక జోనర్ కు సంబంధించినదని చెప్పవచ్చు. కానీ ఖలేజా సినిమా కామెడీ, హార్రర్, యాక్షన్ ఇలా ఒక ప్రత్యేక జోనర్ కు చెందినదని చెప్పలేం. 5. ఖలేజా సినిమాలో సమస్యలతో పోరాడుతున్న ప్రజలను చూపిస్తారు. కానీ అది ఎక్కడో ఉత్తరాది ప్రాంతం కావడంతో ప్రేక్షకులు దానికి కనెక్ట్ అవ్వలేకపోయారు. ఇలా అనేక కారణాలతో ఖలేజా మూవీ బాగున్నప్పటికీ హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…