Balakrishna : సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్‌ను అమాంతం పెంచిన చిత్రం ‘బాషా’. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో, ఫ్లాష్ బ్యాక్ కథలలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది ఈ చిత్రం. ఇందులో అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు రజనీ నట విశ్వరూపం ఈ సినిమాను ఆల్‌టైమ్ హిట్స్‌లలో ఒకటిగా నిలిచిపోయేలా చేసింది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. 1995 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బాషా వసూళ్ల దుమ్ము దులిపింది. ఈ సినిమా కథను దర్శకుడు సురేష్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవికి చెప్పడంతో ఆయన రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. ప్రొడ్యూసర్‌తో బేరానికి దిగగా, ఆ నిర్మాత తెలుగు రైట్స్ కోసం రూ.40లక్షలు డిమాండ్ చేయగా.. అరవింద్ రూ.25 లక్షలకు అడిగారట. బేరం కుదరకపోవడంతో బాషా తెలుగు రీమేక్‌కు సాధ్యం కాలేదు. అయితే ఈ సినిమాని బాలయ్యతో కూడా రీమేక్ చేయాలని అనుకున్నారట. తమిళ్లో భారీ విజయం సాధించిన ఈ సినిమాను నిర్మాతలు తెలుగులో కూడా చేయాలని అనుకున్నారు. దర్శకుడు సురేష్ కృష్ణ తెలుగులో ఈ చిత్రాన్ని బాలకృష్ణ తో రీమేక్ చేయాలని అనుకున్నారు.
సాధారణంగా బాలకృష్ణ రీమేక్ లకు దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో భాషా సినిమాలో అవకాశం వచ్చినా లైట్ తీసుకున్నారు. ఒకవేళ బాలయ్య ఒప్పుకొని ఉంటే భాషా సినిమా నేరుగా తెలుగులో వచ్చి ఉండేది. అప్పుడు సినిమా బాక్సాఫీస్‌ని ఎంతగా షేక్ చేసి ఉండేదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, భాషా సినిమాలో చాలా భాగం ముంబై నేపధ్యంలో జరుగుతుంది. విలన్ తో జరిగే కొన్ని ప్రధాన సన్నివేశాలను ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, హోటల్ తాజ్ ప్రాంతంలో తెరకెక్కించారు. ఏడాది పాటు ఆడిన బాషా అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా 38 కోట్లకు పైగా వసూళ్లు చేసిందని అంచనా.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…