Gold Mine : ఒడిశాలోని మూడు జిల్లాలలో బంగారు నిల్వలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా, మయూర్‌భంజ్, డియోగఢ్ జిల్లాల్లో గనులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా , డైరెక్టరేట్ ఆఫ్ మైన్‌కు చెందిన సర్వేయర్లు గుర్తించారని మంత్రి ప్రఫుల్లా మల్లిక్ తాజాగా అసెంబ్లీలో వెల్లడించారు. కియోంజఝర్ జిల్లాలో నాలుగు చోట్ల గనులు బయటపడగా, మయూర్‌భంజ్‌లో నాలుగు, డియోగఢ్ జిల్లాలో ఒక చోట బంగారు గనులను గుర్తించారని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో మొట్టమొదటిసారిగా లిథియం నిల్వలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) గుర్తించిందని కేంద్ర గనుల శాఖ ఫిబ్రవరి 10న ప్రకటించగా, జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో గల సలాల్-హైమనా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించినట్టు తెలియజేశారు. ఇప్పుడిప్పుడే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు లభించడం శుభ పరిణామం అని అందరు భావించారు. కాగా, బంగారం, లిథియం సహా మొత్తం 51 గనులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్టు గనుల శాఖ తాజాగా స్పష్టం చేసింది.
మూడు జిల్లాల్లో బంగారు గనులు బయట పడటం స్థానికులను కలవర పరుస్తోంది. గనులు సాకులు చూపి తమ భూములు లాక్కుంటారేమో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 51 ఖనిజ క్షేత్రాలను ప్రభుత్వం గుర్తించగా, వీటిల్లో 5 ప్రాంతాల్లో బంగారం నిల్వలు కాగా, మిగిలిన చోట్ల పొటాష్, మాలిబ్డినం, ఇతర బేస్ మూలకాలకు చెందిన నిక్షేపాలను గుర్తించినట్లు తెలియజేసింది.. జమ్ముకశ్మీర్‌తో పాటు ఏపీ, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ నిక్షేపాలు ఉన్నట్లు అప్పట్లోనే గనులశాఖ ఓ ప్రకటన చేసిన విషయం విదితమే.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…