Manchu Lakshmi : టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష్మీ ఇటీవలి కాలంలో నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంది.కొన్ని సార్లు సినిమా విషయాలతో మరి కొన్ని సార్లు సోషల్ మీడియాలో పెట్టే విచిత్ర పోస్ట్‌లు, ఇంకొన్ని సార్లు గ్లామర్‌తో మత్తెక్కించే పోస్ట్‌లు మంచు లక్ష్మీ పేరు వార్తలలో నిలిచేలా చేస్తుంది.ఈ అమ్మడు ఇటీవల మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం మాన్స్టర్ లో నటించింది. ఈ సినిమాలో మోహన్ లాల్‌తో పాటు.. మంచు లక్ష్మీ కీలక రోల్ చేసింది. అయితే ఈ మాన్స్టర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి రాగా, ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మీ తను పెట్టే పోస్ట్ వలన ట్రోల్ కి గురవుతుంది. ఫిబ్రవరి 9న నటుడు సుమంత్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. సుమంత్‌తో కొంత రొమాంటిక్‌గా దిగిన పిక్ షేర్ చేసింది. ఈ పిక్ షేర్ చేయడం పట్ల నెటిజన్స్ మండిపడ్డారు. ఇక తాజాగా ఫ్యాషన్ డిజైనర్ వరుణ్ చక్కిలం ప్రత్యేకంగా రూపొందించిన బట్టల్లో మెరిశారు. తనకు గ్రాండ్ రాయల్ లుక్ ఇచ్చిన సదరు డిజైనర్ కి ధన్యవాదాలు ఆమె తెలిపారు. అయితే ఈ పిక్స్ లో మంచు లక్ష్మీ గెటప్ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా ఉంది.
మేకప్ కాస్త ఎక్కువైందని, ఈ వయస్సులో అంతలా అందాలు ఆరబోయడం అవసరమా అంటూ ఎవరి స్టైల్‌లో వారు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఎవరు ఎంత ట్రోల్ చేసిన కూడా మంచు లక్ష్మీ మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా తనకు నచ్చింది చేసుకుంటూ పోతుంది. మంచు లక్ష్మీ తాజాగా ఆమె అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల కానుంది. అగ్నినక్షత్రంతో పాటు కొన్ని చిత్రాలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. అగ్ని నక్షత్రం మూవీలో మంచు లక్ష్మి లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…