Raasi : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అందాల భామల హవా నడుస్తున్న సమయంలో తన నటనతో అగ్ర తారగా ఎదిగిన ముద్దుగుమ్మ రాశి. హీరోయిన్ అవ్వకముందే బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించింది..ఇక ఆ తర్వాత తమిళం లో విజయ్ హీరో గా నటించిన లవ్ టుడే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..తొలి సినిమాతోనే భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాశి కి తెలుగు మరియు తమిళం బాషలలో చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. పెద్ద పెద్ద హీరోల సరసన కూడా నటించిన రాశి దశాబ్దం పాటు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది . ప్రస్తుతం సినిమాలకు దూరమై వ్యాపార రంగం లో గొప్పగా రాణిస్తూ అప్పుడప్పుడు తెలుగు మరియు తమిళం సీరియల్స్ లో నటిస్తూ ముందుకు పోతుంది.
రాశి వైవాహిక జీవితంకి సంబంధించి అనేక రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈమె శ్రీనివాస్ అనే వ్యక్తిని పెళ్ళాడి సుఖవంతమైన సంసారం జీవితం గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..కానీ అంతకు ముందు కూడా ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యి విడాకులు తీసుకుంది అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.. 18 ఏళ్ళ వయస్సు లోనే తమిళ టాప్ డైరెక్టర్ అశోక్ సామ్రాట్ ని ప్రేమించి పెళ్లాడింది. అతనితో కొన్నాళ్లు కలిసి ఉన్న రాశి.. సురేష్ వర్మ ని వివాహం చేసుకుంది..వీళ్ళ మధ్య కూడా సఖ్యత కుదరకపోవడం తో మళ్ళీ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..ఇక చివరికి శ్రీనివాస్ అనే అతనిని పెళ్ళాడి ఇప్పుడు సంతోషంగా ఉంటుంది.
అయితే రాశి సినిమాలు మానేసాక ఆస్తులు కోల్పోయిందా, ఆమెకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ప్రస్తుతం ఆమె జీవితం సంతోషంగానే ఉందా అనే అంశాలపై ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. భర్తతో సంతోషంగానే ఉంటున్న తనకి ఎలాంటి సమస్య లేదు అంటుంది. తను సంపాదించకపోయిన తన భర్త సంపాదిస్తున్నాడు కాబట్టి ఎలాంటి సమస్య లేదంటుంది. సినిమాలలో ఛాన్స్ ల కోసమే బరువు తగ్గానని ప్రేక్షకులు నన్ను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో అదే విధంగా కనిపించాలని భావిస్తున్నానని రాశి తెలిపారు. 5000 రూపాయల పారితోషికంతో కెరీర్ ను మొదలుపెట్టిన రాశి ఆస్తుల విలువ 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…