నందమూరి బాలకృష్ణ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా దూసుకుపోతున్నాడు. అంతేకాదు ఎవరు ఊహించని విధంగా బుల్లితెరపై ‘అన్ స్టాపబుల్’ షోతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. ఈ షో అన్ని షోల రికార్డ్‌లని తుడిచి పెట్టుకు పోతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేస్తూ వారి నుండి ఆసక్తికర విషయాలు రాబడుతున్నాడు బాలయ్య . మరోవైపు, తొలిసారి ఆయన ఒక యాడ్ లో నటించారు. ప్రముఖ కన్ ష్ట్రక్షన్ కంపెనీ సాయి ప్రియ గ్రూప్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ ఎంతో రాయల్ గా, రిచ్ లుక్ తో ఉంది.
సినిమాటిక్ స్టైల్‌లో ‘116 పారామౌంట్’ వెంచర్‌ను ప్రమోట్ చేస్తూ.. తన దైనశైలిలో డైలాగ్‌లు చెప్తూ అలరించారు బాలయ్య. స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. అయితే ఫస్ట్ యాడ్ ద్వారా బాలయ్య అందుకున్న తొలి పారితోషికం అక్షరాలా రూ.15 కోట్లు. అయితే ఈ భారీ పారితోషికం మొత్తాన్ని.. ‘బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పిటల్’కి దానం చేశారు బాలయ్య. ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన బాలయ్య.. ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్‌ను క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇచ్చాడని తెలిసి ఆయనను అభిమానులు తెగ కీర్తిస్తున్నారు.
బాలయ్య రూ.15 కోట్ల దానానికి సంబంధించిన అప్డేట్‌ని ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేస్ దేవి నాగవళ్లి తన ఫేస్ బుక్‌లో షేర్ చేయగా.. అప్పట్లో అది తెగ వైరల్‌గా మారింది. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్ వీరసింహా రెడ్డి చిత్రంతో రీసెంట్‌గా పలకరించాడు. ఇది మంచి విజయం సాధించింది. సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్యతో పోటీ పడిన ‘వీర సింహారెడ్డి’ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దీంతో పాటు.. అనిల్ రావిపూడి సినిమాను సైతం లైన్‌లో పెట్టాడు బాలయ్య. అటు సినిమాలు చేస్తూ.. ‘అన్ స్టాపబుల్’ షోని కూడా ముందుకు నడిచేలా చేస్తున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…