సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు మహేష్ బాబు. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్‌కి చేరుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు. ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. మహేష్ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. పిల్లల్ని ఎలా ప్రేమించాలో బహుశా నమ్రత-మహేష్ దంపతులను చూసి నేర్చుకోవాలేమో.
కెరీర్, సంపాదన అంటూ బిడ్డల్ని నిర్లక్ష్యం చేసే పేరెంట్స్ మహేష్, నమ్రతలను స్ఫూర్తిగా తీసుకోవాలి. కేవలం ఆస్తులు సంపాదించి ఇవ్వడమే వారసులకు చేసే మేలని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. కాని మహేష్ ఫ్యామిలీ అలా కాదు. సితార, గౌతమ్ లకు అన్నీ తామై వ్యవహరిస్తారు. విద్యాబుద్దులు నేర్పుతారు. వారికి ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. పదేళ్ల సితార చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. దానికి కారణం మహేష్, నమ్రతల పెంపకం. అయితే గౌతమ్ పెరిగి చాలా పెద్దగా అయ్యాడు. ఇన్నాళ్లు తల్లిదండ్రుల చాటు బిడ్డగా ఎదిగిన గౌతమ్ తొలిసారి పేరెంట్స్ లేకుండా ఓ ట్రిప్ కి వెళుతున్నాడు.
ఈ క్రమంలో నమ్రత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గౌతమ్ మొదటిసారి ఒంటరిగా విదేశాలకు కల్చరల్ ట్రిప్ కి వెళుతున్నాడు. నాలో సగభాగం దూరం అవుతున్న భావన కలుగుతుంది. దీన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది అని నమ్రత తెలిపింది. ప్రస్తుతం గౌతమ్ వయసు 16 ఏళ్ళు కాగా, మహేష్ వారసుడిగా రెండు మూడేళ్ళలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మహేష్ చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరను దున్నేశాడు. గౌతమ్ వన్ నేనొక్కడినే మూవీలో మహేష్ చిన్నప్పటి పాత్ర చేశాడు. చూస్తుంటే రానున్న రోజులలో గౌతమ్ కూడా హీరోగా అదరగొట్టడం ఖాయంగా తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…