Wasim Akram : రోజూ 8 కిలోల మ‌ట‌న్ తింటారు.. ఆట ఆడ‌లేరా.. పాక్ ఆట‌గాళ్ల‌పై వసీం అక్ర‌మ్ ఫైర్‌..

Wasim Akram : ప్ర‌స్తుతం భార‌త్ వేదిక‌గా వ‌రల్డ్ కప్ 2023 జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. భాగంగా చెన్నై వేదికగా అప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. పసికూనగా భావించే అప్ఘాన్ జట్టు.. 8 వికెట్ల తేడాతో తన పొరుగు దేశాన్ని చిత్తుగా ఓడించింది. చెపాక్ లాంటి కఠినమైన పిచ్ మీద 283 పరుగుల లక్ష్యా్ని సునాయాసంగా చేధించింది. లక్ష్య చేధనలో ఏ దశలోనూ అప్ఘానిస్థాన్ తడబడినట్టు కనిపించలేదు. పాకిస్థాన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.చెత్త ఫీల్డింగ్‌‌తో పాటు పేలవ బౌలింగ్‌తో 283 పరుగుల భారీ లక్ష్యాన్ని బాబర్ సేన కాపాడుకోలేకపోయింది. పాకిస్థాన్ ఘోర పరాజయంపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఇప్పటికే షోయబ్ అక్తర్ తమ జట్టుపై నిప్పులు చెరగగా.. వసీం అక్రమ్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

అప్ఘానిస్థాన్ చేతిలో తమ జట్టు చిత్తుగా ఓడిపోవడంతో.. పాకిస్థాన్ ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇండియా చేతిలో ఓడినప్పుడు సాకులు చెప్పారు.. మరి ఇప్పుడేం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. బాబర్ ఆజమ్ కెప్టెన్సీపైనా ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ అయితే ఓ అడుగు ముందుకేసి పాక్ క్రికెటర్ల తిండి అలవాట్లను ప్రశ్నిస్తూ దుమ్మెత్తి పోసాడు . 280కిపైగా పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేధించడం అనేది చాలా పెద్ద విషయం. పిచ్ తడిగా ఉందా లేదా అనేది పక్కనబెడితే.. ఓసారి మనోళ్ల ఫీల్డింగ్ చూడండి.. ఫిట్‌నెస్ స్థాయిలు ఎలా ఉన్నాయో చూడండి’’ అంటూ ఓ పాకిస్థాన్ టీవీ షోలో అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Wasim Akram very angry on pakisthan cricket players
Wasim Akram

పాక్ ఆటగాళ్లెవరికీ రెండేళ్లుగా ఎలాంటి ఫిట్‌నెస్ టెస్టులను చేయలేదని మనం గత మూడు వారాలుగా మొత్తుకుంటున్నాం. ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి మాట్లాడితే.. ముఖాలు వాడిపోతాయి. వీళ్లను చూస్తుంటే.. ప్రతి రోజూ 8 కిలోల మటన్ తింటున్నట్టు కనిపిస్తున్నారు. వీళ్లకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించొద్దా..? అని అక్రమ్ ప్రశ్నించాడు. ఆయ‌న చేసిన కామెంట్స్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

15 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago